
ఖాతా ప్రతులను అందజేస్తున్న సర్పంచ్ దంపతులు
జక్రాన్‌పల్లి: తమ వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని అర్గుల్ సర్పంచ్ గోర్త పద్మ రాజేందర్ దంపతులు వినూత్నంగా ఆలోచించారు. గ్రామంలోని 10 మంది బాలికలకు సుకన్య సమృద్ధి యోజన ఖాతాలు తెరిపించారు. తమ సొంత ఖర్చులతో ఖాతాలు తెరిపించారు. ఈ ఖాతాలతో బాలికలకు ఎంతో మేలు జరుగుతుందని సర్పంచ్ పద్మ రాజేందర్ దంపతులు తెలిపారు. సర్పంచ్ దంపతుల ఆలోచన విధానం, పేద బాలికలకు ఉచితంగా ఖాతాలు తీయడం పట్ల పిల్లల తల్లిదండ్రులు, గ్రామస్తులు అభినందించారు. సర్పంచ్ గోర్త పద్మ, ఉపసర్పంచ్ గోర్త రాజేందర్, అంగన్‌వాడీ టీచర్ గీత, బీపీఎం క్రితిక్‌గౌడ్, బాలికల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
వివాహ వార్షికోత్సవాన్ని
పురస్కరించుకుని బాలికలకు సుకన్య సమృద్ధి యోజన ఖాతాలు