
చెక్కులు పంపిణీ చేసిన ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్
మోపాల్(నిజామాబాద్‌రూరల్): కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, ఆ పార్టీ పాలిత రాష్ట్రాల్లో అభివృద్ధి శూన్యమని, దేశం ఎక్కడా లేని విధంగా అభివృద్ధి, అమలు కాని సంక్షేమ పథకాలు తెలంగాణలో అమలవుతున్నాయని ఆర్టీసీ చైర్మన్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ పేర్కొన్నారు. గురువారం నగరశివారులోని రూరల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మోపాల్ మండలానికి చెందిన 83 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్, 12 మందికి సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి గతంలో ఎవరూ చేయలేదని పేర్కొన్నారు. అకాల వర్షాలకు నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.10 వేలు ఇస్తున్నారని, మహిళలపై సీఎం కేసీఆర్‌కు అపార నమ్మకముందని, వారి మద్దతుతోనే మరోసారి రాష్ట్రంలో అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. ప్రతిపక్ష పార్టీలు సీఎం, స్థానిక ఎమ్మెల్యేలను బదనాం చేస్తున్నాయని విమర్శించారు. ఉచితాలకు ప్రధాని మోదీ వ్యతిరేకమని, బీజేపీ కార్పొరేట్లకు కొమ్ముకాస్తుందని, రుణాలు ఎగ్గొట్టే వారికి రూ.13 లక్షల కోట్లు మాఫీ చేసిందని ఆరోపించారు. అప్పులు చేసి పథకాలు కొనసాగిస్తున్న మాట వాస్తవమేనని, కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక ఏం చేశారని రూ.100 లక్షల కోట్లు అప్పులయ్యాయని ప్రశ్నించారు. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ప్రతిపక్ష పార్టీల నాయకులు చెప్పే మాయమాటలు నమ్మి మోసపోవద్దని హితవుపలికారు. కేసీఆర్ ప్రధాని అయితే మనకే గర్వకారణమన్నారు. ఎంపీపీ లతా కన్నీరాం, రైతుసమితి అధ్యక్షుడు శ్రీనివాస్‌రావు, తహసీల్దార్ లత, ఆర్‌ఐ రాజేశ్వర్, స్థానిక ప్రజాప్రతినిధులున్నారు.
బీజేపీ కార్యకర్త కుటుంబానికి..
కంజర్ గ్రామంలో ఓ బీజేపీ కార్యకర్త కుటుంబానికి బాజిరెడ్డి గోవర్ధన్ కల్యాణలక్ష్మి చెక్కు అందజేశారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం మనందరిదని, సంక్షేమ పథకాలు పార్టీలకతీతంగా అందాలన్నదే కేసీఆర్ అభిమతమని పేర్కొన్నారు. బీజేపీ కార్యకర్తలు, వారి కుటుంబసభ్యులు పునరాలోచించి, బీఆర్‌ఎస్‌కు మద్దతుగా నిలవాలని ఆయన కోరారు.
కేసీఆర్ ప్రధాని అయితే మనకే
గర్వకారణం
ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్