
అమూల్య కృష్ణవేణి మనీష్
పెర్కిట్(ఆర్మూర్)/జక్రాన్‌పల్లి/ఇందల్వాయి: ఆర్మూర్ మండలం మగ్గిడి ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన అమూల్య జాతీయ స్థాయి సబ్ జూనియర్ వాలీబాల్ పోటీలకు ఎంపికై నట్లు పీఈటీ మధు గురువారం తెలిపారు. ఇటీవల వరంగల్ జిల్లాలో నిర్వహించిన శిక్షణ శిబిరంలో అమూల్య ప్రతిభ చూపిజాతీయ స్థాయి ఎంపికై నట్లు పీఈటీ తెలిపారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రం హుగ్లీలో ఈ నెల 28నుంచి జూన్ ఒకటి వరకు నిర్వహించే జాతీయస్థాయి పోటీల్లో విద్యార్థిని పాల్గొననున్నట్లు తెలిపారు. అలాగే జక్రాన్‌పల్లి మండలంలోని కలిగోట్ గ్రామానికి చెందిన నాయిక మనీష్ జాతీ య స్థాయి సబ్ జూనియర్ వాలీబాల్ పోటీలకు ఎంపికై నట్లు పీఈటీ యాదగిరి తెలిపారు. ఇందల్వాయిలోని ఏకలవ్య గురుకుల ఆదర్శ పాఠశాల విద్యార్థిని కృష్ణవేణి అండర్–16 జాతీయ వాలీబాల్ పోటీలకు ఎంపికై నట్లు ప్రిన్సిపల్ శ్రీనివాస్ తెలిపారు.

