కడెం: లారీ, బైక్‌ను ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు అక్కడిక్కడే మృతి చెందిన ఘటన మండలంలో చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని అల్లంపల్లి పంచాయతీ పరిధి గుర్రంమదిర గ్రామానికి చెందిన ఉయిక భీంరావు(23), అదే గ్రామానికి చెందిన కుమురం రాంబాయి(47) రైతుబంధు డబ్బులు కోసం శనివారం బైక్‌పై మండల కేంద్రంలోని బ్యాంక్‌కు వెళ్లారు. శనివారం బంద్ ఉండడంతో తిరుగుపయనమయ్యారు. ఉడుంపూర్ అటవీప్రాంతంలో అల్లంపల్లి నుంచి ఆవుపేడ లోడుతో వస్తున్న లారీ, బైక్‌ను రాంగ్‌రూట్‌లో ఎదురుగా ఢీకొట్టింది. బైక్‌పై ఉన్న ఇద్దరిని కొద్దిదూరం మేర ఈడ్చుకెళ్లగా అక్కడిక్కడే మృతిచెందారు. లారీడ్రైవర్ నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడమే ప్రమాదానికి కారణామని స్థానికులు, పోలీసులు భావిస్తున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, మృతురాలు రాంబాయికు ముగ్గురు పిల్లలు కాగా, ఒకరికి వివాహామైంది. భర్త నాగోరావు గతంలో చనిపోయాడు.


