వైద్యులపై దాడులు అమానుషం | - | Sakshi
Sakshi News home page

వైద్యులపై దాడులు అమానుషం

Mar 29 2026 6:54 AM | Updated on Mar 29 2026 6:54 AM

నిర్మల్‌ టౌన్‌: ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసమే 24గంటల పాటు అందుబాటులో ఉంటూ సేవలు అందిస్తున్నామని, అలాంటి తమపైన దాడులు చేయడం హేయనీయమని ఐఎంఏ జిల్లా బాధ్యులు, పలువురు వైద్యులు పేర్కొన్నారు. నిర్మల్‌ ప్రెస్‌క్లబ్‌లో శనివారం సమావేశమయ్యారు. ఐ ఎంఏ జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ మురళీధర్‌, రాష్ట్ర జాయింట్‌ సెక్రెటరీ డాక్టర్‌ రామకృష్ణ మాట్లాడు తూ.. సంతోష్‌రాజ్‌పై జరిగిన దాడిని ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ ఖండిస్తోందన్నారు. ఈ దాడిపై రాష్ట్ర, జాతీయ ఐఎంఏ శాఖలు స్పందించాయని తెలిపారు. గంటపాటు ఓపీ సేవలు నిలిపివేసి, నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపామన్నారు. ఇలాంటి ఘటనలను ఎవరు ప్రోత్సహించరని చెప్పారు. వైద్యులు, ఆస్పత్రులపై దాడికి పా ల్పడినవారిపై నాన్‌ బెయిలబుల్‌ కేసులు నమోదు అవుతాయని, పదేళ్ల జైలుశిక్షతోపాటు ఆస్తుల జప్తు వంటి శిక్షలు ఉంటాయని వివరించారు. పోలీసులు 24 గంటల్లో నిందితులను అరెస్టు చేస్తామని ఇచ్చిన హామీ మేరకు తాము ఆందోళన విరమించినట్లు తెలిపారు. వైద్యుడిపై దాడిని ఖండించిన ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి సహా, ఇతర ప్రజాప్రతినిధులు నా యకులు, జిల్లా ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.

రీయింబర్స్‌మెంట్‌ బిల్లు అడిగి..

వైద్యురాలు రంజిత సంతోష్‌రాజ్‌ మాట్లాడుతూ.. పది రోజుల కిందట ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయిన వారు రీయంబర్స్‌మెంట్‌ బిల్లు కోసం వచ్చారని చెప్పారు. తాము ఇచ్చిన బిల్లుల ప్రకారం కాకుండా రెట్టింపు ఇవ్వడం కుదరదని చెప్పడంతో వారు ముందుగా ఆస్పత్రి సిబ్బందిపై, ఆ తర్వాత వైద్యుడు సంతోష్‌రాజ్‌పై దాడి చేశారని వివరించారు. ఐఎంఏ నిర్మల్‌ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ ప్రమోద్‌చంద్రారెడ్డి, ప్రచార కార్యదర్శి డాక్టర్‌ కృష్ణంరాజు, బాధ్యులు డాక్టర్‌ దేవేందర్‌రెడ్డి, పలువురు డాక్టర్లు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement