బాసర: మండలలోని కిర్గుల్(కె) గ్రామంలో రామ మందిర నిర్మాణానికి ఎమ్మెల్యే రామారావు పటేల్ సర్పంచ్ మాలేగం మధుప్రీతితో కలిసి శుక్రవారం భూమిపూజ చేశారు. సీజీఎఫ్ నిధుల ద్వారా రూ.22.40 లక్షలు ఆలయ నిర్మాణానికి కేటాయించారు. గ్రామస్తులు రూ.5.60 లక్షలు విరాళంగా సేకరించారు. మొత్తం రూ.28 లక్షల వ్యయంతో ఆలయ నిర్మాణం చేపట్టనున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామారావు పటేల్ మాట్లాడుతూ గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని పెంపొందించేందుకు ఈ రామ మందిరం కీలకపాత్ర పోషిస్తుందని తెలిపారు. గ్రామ పెద్దలు, యువకులు ఈ నిర్మాణా నికి ముందుకు వచ్చి సహకరించడం అభినందనీ యమని అన్నారు. విరాళాలు అందించిన దాతలను అభినందించారు. కార్యక్రమంలో ఓని సర్పంచ్ జాదవ్ జగదీశ్‌పటేల్, కిర్గుల్(బి)సర్పంచ్ సరోజన మాజీ జెడ్పీటీసీ సౌండ్లి రమేశ్, బీజేపీ మండల అధ్యక్షుడు సాయినాథ్ పటేల్ బలగం శైలేశ్, సీహెచ్.సాయినాథ్, స్థానిక నాయకులు, గ్రామ పెద్దలు, మహిళలు పాల్గొన్నారు.


