● ఘనంగా శ్రీరామ నవమి వేడుకలు ● ఊరూరా సీతారాముల కల్యాణం.. మార్మోగిన రామనామం ● తిలకించి పులకించిన భక్తజనం ● నిర్మల్‌, భైంసాలో ఘనంగా శోభాయాత్ర | - | Sakshi
Sakshi News home page

● ఘనంగా శ్రీరామ నవమి వేడుకలు ● ఊరూరా సీతారాముల కల్యాణం.. మార్మోగిన రామనామం ● తిలకించి పులకించిన భక్తజనం ● నిర్మల్‌, భైంసాలో ఘనంగా శోభాయాత్ర

Mar 28 2026 7:28 AM | Updated on Mar 28 2026 7:28 AM

● ఘనంగా శ్రీరామ నవమి వేడుకలు ● ఊరూరా సీతారాముల కల్యాణం.. మార్మోగిన రామనామం ● తిలకించి పులకించిన భక్తజనం ● నిర్మల్‌, భైంసాలో ఘనంగా శోభాయాత్ర

(నిర్మల్‌టౌన్‌/భైంసాటౌన్‌): జైశ్రీరామ్‌.. జైజై శ్రీరా మ్‌.. అంటూ.. జిల్లా వ్యాప్తంగా రామ నామం మా ర్మోగింది. శుక్రవారం శ్రీరామ నవమి సందర్భంగా ఊరూరా.. వాడవాడలా సీతారాముల క ల్యాణం వై భవంగా జరిపించారు. రామాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. సీతారాముల కల్యాణం తిలకించి పులకించారు. అనంతరం భక్తులకు అన్నదానం చే శారు. నిర్మల్‌ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి బ్రహ్మపురి రామమందిర్‌లో జరిగిన కళ్యాణోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ అప్పాల కావ్య, వైస్‌ చైర్మన్‌ అప్పాల గణేశ్‌చక్రవర్తి రామాలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీరామనవమి సందర్భంగా నిర్మల్‌లో హిందూవాహిని, బజరంగ్‌దళ్‌ ఆధ్వర్యంలో, భైంసా పట్టణంలో హిందూవాహిని–మహీష శాఖ ఆధ్వర్యంలో శ్రీరాముడు, హనుమాన్‌ శోభాయాత్ర ఘ నంగా నిర్వహించారు. నిర్మల్‌ దేవరకోట దేవస్థా నం వద్ద ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి శ్రీరాము డు, హనుమాన్‌ విగ్రహాలకు ప్రత్యేక పూజలు చేసి, కాషాయ జెండా ఊపి శోభాయాత్రను ప్రారంభించారు. యాత్ర చింతకుంటవాడ, పాత బస్టాండ్‌, బుధవార్‌పేట్‌, గాంధీచౌక్‌ మీదుగా కొనసాగింది. జైశ్రీరామ్‌ నినాదాలతో వీధులన్నీ మార్మోగాయి. పురాణబజార్‌లోని గోశాలలో ముధోల్‌ ఎమ్మెల్యే పి.రామారావు పటేల్‌, మున్సి పల్‌ చైర్మన్‌ తూమోల్ల దత్తాత్రి, ఎస్పీ జానకీషర్మిల, ఏఎస్పీ సాయికుమార్‌రాముడి విగ్రహానికి పూజలు చేసి శోభాయాత్ర ప్రారంభించారు. గోశాల నుంచి పురాణబజార్‌ మీదుగా గుజిరిగల్లి, గణేశ్‌నగర్‌, కుభీర్‌ రోడ్‌ మీదుగా పద్మావతి కాలనీ నుంచి బస్టాండ్‌ ప్రధాన రోడ్డు మీదుగా శాసీ్త్రనగర్‌లోని రాంలీలా మైదానం వరకు శోభాయాత్ర సాగింది. శోభాయాత్రల్లో యువకులతో కలిసి ఎమ్మెల్యేలు, భైంసా మున్సిపల్‌ చైర్మన్‌ నృత్యం చేశారు. నిర్మల్‌లో పోలీసులు చూపిన రూట్‌ మ్యాప్‌ కాకుండా.. మరో రూట్‌లో ఈ శోభాయాత్ర ను కొనసాగించారు. ఈ మార్గంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ అప్పాల కావ్య, వైస్‌ చైర్మన్‌ గణేశ్‌ చక్రవర్తి ఆధ్వర్యంలో వాటర్‌, మజ్జిగ పంపిణీ చేశారు. భైంసాలో పద్మావతి కాలనీలో జువెల్లరీ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో, ఫ్రెండ్స్‌ యూత్‌ ఆధ్వర్యంలో బస్టాండ్‌ మార్గంలో, నర్సింహాయోగా అసోసియేష న్‌ ఆధ్వర్యంలో, తదితర చోట్ల మజ్జిగ, మంచినీటి పంపిణీ చేశారు. ఎస్పీ జానకీషర్మిల, అదనపు ఎస్పీలు ఉపేంద్రారెడ్డి, సాయికిరణ్‌ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ప్రార్థన స్థలాల పోలీసులను మోహరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement