శ్రీరామనవమికి భారీ బందోబస్తు.. | - | Sakshi
Sakshi News home page

శ్రీరామనవమికి భారీ బందోబస్తు..

Mar 27 2026 9:29 AM | Updated on Mar 27 2026 9:29 AM

● ఎస్పీ జానకీషర్మిల

భైంసాటౌన్‌: పట్టణంలో శుక్రవారం జరిగే శ్రీరామనవమి శోభాయాత్ర సందర్భంగా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ జానకీషర్మిల తెలిపారు. పట్టణంలోని తన క్యాంప్‌ కార్యాలయంలో గురువారం డివిజన్‌ పోలీసు అధికారులతో ఆమె సమీక్ష చేశారు. శోభాయాత్ర సందర్భంగా అవాంఛనీయ ఘటనలు జరుగకుండా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. సున్నిత ప్రాంతాల్లో డ్రోన్‌ కెమెరాలతో పర్యవేక్షణ ఉంటుందని పేర్కొన్నారు. శోభాయాత్ర మార్గంలో ట్రాఫిక్‌ నియంత్రణకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించి, ప్రజలకు అసౌకర్యం లేకుండా చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. సమావేశంలో సీఐలు ప్రవీణ్‌కుమార్‌, సాయికుమార్‌, రవీందర్‌, ఎస్సైలు ఉన్నారు.

బాధితులకు సత్వర న్యాయం అందించాలి

అంతకుముందు తన కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. భైంసా సబ్‌ డివిజన్‌ పరిధిలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 9 మంది అర్జీదారుల నుంచి ఫిర్యాదులు స్వీకరించి, వాటి పరిష్కారానికి సంబంధిత ఎస్‌హెచ్‌వోలకు సూచనలు చేశారు. అలాగే గత గ్రీవెన్స్‌లో వచ్చిన ఫిర్యాదుల పరిష్కారస్థితి, పెండింగ్‌లో ఉన్న ఫిర్యాదుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు.

కౌన్సెలింగ్‌తో ఒక్కటైన జంట

భైంసాటౌన్‌: పట్టణంలోని ఎస్పీ క్యాంప్‌ కా ర్యాలయంలో కుటుంబ వివాదాల పరిష్కారానికి ఏర్పాటు చేస్తున్న భరోసా కేంద్రం స త్ఫలితాలిస్తోంది. వివిధ కారణాలతో, చిన్నపాటి మనస్పర్థలతో విడిపోయిన జంటలకు పోలీసులు కౌన్సెలింగ్‌ చేస్తున్నారు. గురువా రం సైతం ఓ జంట భరోసా కేంద్రంను ఆశ్రయించారు. మనస్పర్థలతో కొన్నినెలలుగా దూరంగా ఉంటున్న దంపతులకు భరోసా కేంద్రంలో కౌన్సెలింగ్‌ నిర్వహించారు. వారి చొరవతో ఆ దంపతులు ఒక్కటయ్యా రు. ఈ సందర్భంగా దంపతులు ఎస్పీకి, భరోసా కేంద్రం సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement