నిర్మల్‌ | - | Sakshi
Sakshi News home page

నిర్మల్‌

Mar 25 2026 6:58 AM | Updated on Mar 25 2026 6:58 AM

బుధవారం శ్రీ 25 శ్రీ మార్చి శ్రీ 2026

న్యూస్‌రీల్‌

పునర్విభజనతో మారనున్న రాజకీయ ముఖచిత్రం ఉమ్మడి జిల్లాలో కొత్తగా మరో ఐదు శాసనసభ స్థానాలు లోక్‌సభ నియోజకవర్గ స్థానాల్లోనూ మార్పులు 2011జనాభా ప్రాతిపదికన కేంద్రం కసరత్తు 2029లో ఎస్సీ, ఎస్టీ, మహిళా, జనరల్‌ రిజర్వు స్థానాల్లో ఎన్నికలు

విదేశీ యత్రకు సార్లు

తెలంగాణ ప్రభుత్వం విద్యారంగాన్ని అంతర్జాతీయ ప్రమాణాలకు తీసుకెళ్లే దిశగా నిర్ణయాలు తీసుకుంటోంది. ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు విదేశాలకు పంపించనుంది.

క్షయ నిర్మూలనకు కృషి చేయాలి

నిర్మల్‌చైన్‌గేట్‌: జిల్లాలో క్షయ వ్యాధిని నిర్మూలించడానికి అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని డీఎంహెచ్‌వో డాక్టర్‌ రాజేందర్‌ కోరారు. ప్రపంచ క్షయ నివారణ దినం జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయంలో మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ రాజేంద్ర మాట్లాడుతూ టీబీ ముక్త్‌ భారత్‌ అభియాన్‌ కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని 106 గ్రామాల్లో 100 రోజులు స్కీన్రింగ్‌ పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. క్షయ నిర్ధారణ అయినవారికి చికిత్స అందించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో కార్యక్రమ నిర్వహణాధికారి డాక్టర్‌ పవన్‌, డిప్యూటీ జిల్లా విస్తరణ, మీడియా అధికారి బారె రవీందర్‌, ఆరోగ్య పర్యవేక్షకులు, ఎస్టీఎల్‌ఎస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: అసెంబ్లీ, లోక్‌సభ స్థానాల పునర్విభజన(డీ లిమిటేషన్‌)పై కేంద్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. 2029లో జరిగే ఎన్నికల నాటికి శాసనసభ, లోక్‌సభ స్థానాలు పెంచాలనే ప్రణాళికతో ముందుకు వెళ్తోంది. ప్రస్తుతం మొదలైన జనగణన ప్రక్రియ ఇప్పట్లో పూర్తయ్యేలా లేదు. దీంతో 2011 జనాభా ప్రాతిపదికనే కొత్త స్థానాలు పెంచేందుకు ప్రణాళికలు సాగుతున్నాయి. నాటి లెక్కల ప్రకారం రాష్ట్రంలో మరో ప్రస్తుతం ఉన్న 119 శాసనసభ స్థానాలకు మరో సగం శాతం అంటే 60వరకు పెరిగే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోనూ ప్రస్తుతం ఉన్న పది శాసనసభ స్థానాలకు మరో ఐదు స్థానాలు పెరిగి మొత్తం 15 స్థానాలకు చేరుకునే అవకాశాలు ఉన్నాయి. దీంతో ఉమ్మడి జిల్లా నుంచి శాసనసభ్యుల సంఖ్య పెరగనుంది.

రిజర్వు స్థానాల్లో మార్పులు

కొత్త స్థానాల ఏర్పాటుతో ఉమ్మడి జిల్లా ముఖచిత్రమే పూర్తిగా మారిపోనుంది. 2009 చివరలో నియోజకవర్గాల పునర్విభజనలో కేవలం సర్దుబాటు చేయగా, రిజర్వేషన్లు మాత్రమే మారాయి. కానీ సంఖ్యలో మార్పు రాలేదు. తాజాగా 15 స్థా నాలకు చేరితే చట్టసభలకు ప్రజాప్రతినిధుల సంఖ్య మరింత పెరగనుంది. ఇక కొత్తగా ఏర్పాటయ్యే స్థానాల్లో మహిళలు, ఎస్సీ, ఎస్టీ, జనరల్‌ స్థానాల్లో మార్పులు చోటు చేసుకోనున్నాయి. మహిళా రిజర్వేషన్‌ బిల్లు 2023 ప్రకారం అసెంబ్లీ, పార్లమెంటు స్థానాల్లో 33శాతం మహిళలకు రిజర్వు చేయాల్సి ఉంది. జిల్లా యూనిట్‌గా ఎస్టీ జనాభా ఆ వర్గాలకు స్థానాల రిజర్వు జరగనుంది. ఎస్సీ స్థానాలకు రాష్ట్ర యూనిట్‌గా రిజర్వు అయ్యే అవకాశం ఉంది. ఇక మహిళా రిజర్వేషన్‌ రాష్ట్ర, జిల్లా జనాభా ప్రాతిపదికన ఇస్తారా? లేక లాటరీ ప్రాతిపదికన కేటాయిస్తారా అనేది స్పష్టత రావాల్సి ఉంది.

రాష్ట్రం యూనిట్‌గా లోక్‌సభ స్థానాలు

మరో వైపు రాష్ట్రంలో 17 లోక్‌సభ స్థానాలు ఉండగా, మరో తొమ్మిది పెరగనున్నాయి. అయితే రాష్ట్ర స్థాయి జనాభా యూనిట్‌గా లోక్‌సభ స్థానాలు ఏర్పాటు కానున్నాయి. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో ప్రస్తుతం ఉన్న ఆదిలాబాద్‌(ఎస్టీ), పెద్దపల్లి(ఎస్సీ) ఎంపీ స్థానాలతోపాటు మరోస్థానం కొత్తగా ఏర్పాటవుతుందా? లేదా? అనేది డీలిమిటేషన్‌ ప్రక్రియ మొదలైతేనే స్పష్టత రానుంది.

ఒకే జిల్లా పరిధిలోనే నియోజకవర్గాలు

కొత్త జిల్లాల ప్రకారమే అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన జరగనుంది. దీంతో భౌగోళికంగా నియోజకవర్గాలు వేర్వేరు జిలాల్లో కాకుండా ఒకే జిల్లాలోనే ఉండనున్నాయి. 2016లో కొత్త జిల్లాల ఏర్పాటుతో ఉమ్మడి జిల్లాలోని పది స్థానాలు అటు ఇటుగా మారాయి. ఆదిలాబాద్‌ జిల్లా పరిధిలో పూర్తిగా స్థాయి ఆదిలాబాద్‌, బోథ్‌లు ఉండగా, ఆసిఫాబాద్‌ నియోజకవర్గం నార్నూర్‌, గాదిగూడ మండలాలు ఉన్నాయి. నిర్మల్‌ జిల్లాలో నిర్మల్‌, ముథోల్‌ ఉండగా, పాక్షికంగా ఖానాపూర్‌ నియోజకవర్గంలోని పెంబి, దస్తూరాబాద్‌, కడెం మండలాలు ఉన్నాయి. మిగతా ఉట్నూరు, ఇంద్రవెల్లి మండలాలు ఆదిలాబాద్‌ జిల్లాలో, జన్నారం మండలం ఒక్కటి మంచిర్యాల జిల్లాలో ఉంది. ఇక మంచిర్యాల జిల్లా పరిఽధిలో మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూరు పూర్తి స్థాయిలో ఉన్నాయి. ముథోల్‌, సిర్పూర్‌ నియోజకవర్గాల పరిధిలో గ్రామాలు సైతం పక్క జిల్లాల్లో ఉన్నాయి. దీంతో పాలనలో ఇబ్బందులు రాకుండా ఒకే జిల్లా పురిధిలోనే నియోజకవర్గాల పునర్విభజన పూర్తయ్యేలా కసరత్తు జరుగుతన్నట్లు తెలుస్తోంది.

ఎక్కడెక్కడ కొత్తవి?

ఆదిలాబాద్‌, నిర్మల్‌, మంచిర్యాల జిల్లా కేంద్రాలైన అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోనే అత్యధిక జనాభాతో ఉన్నాయి. ఈ క్రమంలో ఆయా నియోజకవర్గాల పరిధి మండలాలను కలుపుతూ మళ్లీ కొత్తగా స్థానాలు ఏర్పాటయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆదిలాబాద్‌తోపాటు విస్తీర్ణంలో పెద్దదైన బోథ్‌ స్థానం, ఖానాపూర్‌ పరిధి ఏజెన్సీ ఉట్నూర్‌లో మార్పు జరగనుంది. మంచిర్యాల నియోజకవర్గ పరిధి నగర ప్రాంతం, గ్రామీణ ప్రాంతాలైన లక్సెట్టిపేట, ఇక ఆసిఫాబాద్‌, సిర్పూర్‌ రెండు నియోజకవర్గాల పరిధి మండలాల్లోనూ కొత్తగా ఒక స్థానం ఏర్పడనుంది.

ఉమ్మడి జిల్లా అసెంబ్లీ స్థానాలు

జిల్లా 2011 జనాభా పాతవి కొత్తగా

ఆదిలాబాద్‌ 7,08,972 02 02

కుమురంభీం 5,15,812 02 01

మంచిర్యాల 8,07,037 03 01

నిర్మల్‌ 7,09,418 03 01

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement