నిర్మల్‌చైన్‌గేట్: నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథకం రూపొందించింది. ఈ పథకం లబ్ధిదారుల ఎంపిక కోసం ప్రభుత్వం గతేడాది దరఖాస్తులు కూడా స్వీకరించింది. అయి తే ఒక్కరికి కూడా రుణాలు ఇవ్వలేదు. దీంతో దరఖాస్తుదారుల్లో నైరాశ్యం నెలకొంది. ఈతరుణంలో రాష్ట్ర ప్రభుత్వం పథకం అమలుకు ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో రూ.6 వేల కోట్లు కేటాయించింది. దీంతో దరఖాస్తుదారుల్లో ఆశలు చిగురిస్తున్నాయి.
37 వేల దరఖాస్తులు
రాజీవ్ యువ వికాసం పథకానికి 2025లో ప్రభుత్వం దరఖాస్తులను స్వీకరించింది. ఇందులో భాగంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్లకు జిల్లాలో 37 వేలకుపైగా దరఖాస్తులు అందాయి. ఆయా సామాజికవర్గాల వారికి కార్పొరేషన్ల ద్వారా రాయితీ రుణాలు 2025 జూన్ 2న ఇవ్వాలని ప్రభుత్వం తొలుత నిర్ణయించింది. అయితే అప్పట్లో కేటాయింపులు లేకపోవడం, ఇతర సాంకేతిక కారణాలతో పథకం అమలుకు బ్రేక్ పడింది. తాజాగా నిధులు కేటాయించడంతో ఆశలు చిగురించాయి.
చిన్న రుణాలు వంద శాతం రాయితీ..
రాజీవ్ యువ వికాసం పథకంలో భాగంగా వివిధ కార్పొరేషన్ల ద్వారా రూ.50 వేల వరకూ రుణ సదుపాయం కల్పిస్తే వంద శాతం రాయితీ ప్రకటించారు. రూ.లక్ష వరకు రుణం పొందితే 90 శాతం రాయితీ, రూ.2 లక్షల వరకు రుణం పొందితే 80 శాతం రాయితీని రూ.2 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు రుణం పొందినవారికి 70 శాతం రాయితీని అందిస్తామని ప్రభుత్వం వెల్లడించింది. ఎక్కువ మంది రూ.4 లక్షల వరకు రుణాలు పొందాలని దరఖాస్తు చేసుకున్నారు.
మండలాల వారీగా రాజీవ్ యువ వికాసం
పథకానికి అందిన దరఖాస్తులు
మండలం ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీ
బాసర 25 196 403 115
భైంసా 82 638 1,228 253
దస్తురాబాద్ 161 302 488 2
దిలావర్‌పూర్ 130 191 534 163
కడెం 412 690 930 83
ఖానాపూర్ 274 536 957 67
కుభీర్ 469 431 1,234 107
కుంటాల 94 261 799 89
లక్ష్మణచాంద 103 280 717 78
లోకేశ్వరం 110 431 811 74
మామడ 325 238 501 124
ముధోల్ 95 338 586 298
నర్సాపూర్(జి) 88 229 644 164
నిర్మల్ రూరల్ 178 334 869 70
పెంబి 207 97 234 20
సారంగాపూర్ 499 425 1,387 160
సోన్ 101 204 722 75
తానూర్ 143 375 755 95
భైంసా
మున్సిపాలిటీ 21 383 952 1,218
ఖానాపూర్
మున్సిపాలిటీ 28 259 784 340
నిర్మల్
మున్సిపాలిటీ 82 514 2,757 2,376
కార్పొరేషన్ దరఖాస్తులు మంజూరైన రాయితీ
యూనిట్లు నిధులు కోట్లలో
ఎస్సీ 7350 2894 39.96
ఎస్టీ 3627 2325 25.35
బీసీ 17286 3876 41.00
ఎంబీసీ/ఈబీసీ 923 842 8.90
మైనార్టీ 5926 1045 17.41
క్రిస్టియన్ 65 27 0.42


