నిర్మల్‌చైన్‌గేట్: నిరంతర విద్యుత్ సరఫరాకు చర్యలు తీసుకోవాలని టీజీఎన్‌పీడీసీఎల్ హన్మకొండ ఆపరేషన్స్ డైరెక్టర్ టి.మధుసూదన్, చీఫ్ ఇంజినీర్ బి.అశోక్ అన్నారు. జిల్లా కేంద్రంలోని పెన్షనర్ సంఘ భవనంలో మంగళవారం సమావేశం నిర్వహించారు. 33, 11 కేవీ ఫీడర్లకు ప్రత్యామ్నాయ విద్యుత్ సరఫరా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. దెబ్బతిన్న డీటీఆర్‌లను శాఖకు చెందిన వాహనాల ద్వారా ఉచితంగా తరలించాలని తెలిపారు. ఫెయిల్ అయిన ట్రాన్స్‌ఫార్మర్లకు యుద్ధ ప్రాతిపదికన మరమ్మతు చేయాలన్నారు. వేసవికి అనుగుణంగా ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ఓవర్‌లోడ్ నివారణకు కొత్త ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. వినియోగదారులకు 1912 ద్వారా మెరుగైన సేవలు అందించాలన్నారు. భద్రతా అవగాహన కార్యక్రమాలు, పల్లెబాట నిర్వహణపై దృష్టి పెట్టాలని తెలిపారు. సౌర విద్యుత్ వినియోగాన్ని ప్రోత్సహించాలన్నారు. కార్యక్రమంలో విద్యుత్ శాఖ ఎస్‌ఈ జె సుభాష్, డీఈలు డి నాగరాజు, ఓ వెంకటేశ్వర్లు, తిలక్, ఏడీఈలు, ఏఈలు పాల్గొన్నారు.


