జన్నారం: మానవ హక్కుల కమిషన్ చైర్‌పర్సన్ డా.జస్టిస్ షమీమ్ అక్తర్ తన పర్యటనలో భాగంగా ఆదివారం సాయంత్రం జన్నారం చేరుకున్నారు. జన్నారం హరిత రిసార్ట్‌కు వచ్చిన ఆయనకు కలెక్టర్ కుమార్ దీపక్ మొక్క అందజేసి స్వాగతం పలికారు. రాత్రి ఇక్కడే బస చేసి సోమవారం ఉదయం సఫారీ ద్వారా అడవిలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం గిరిజనులను కలిసి వారి స్థితిగతులు అడిగి తెలుసుకోనున్నారు. ఇంధన్‌పల్లి రేంజ్ పరిధిలో గిరిజనులు చేస్తున్న వెదురు కళావృత్తులను పరిశీలించనున్నారు. కలెక్టర్‌తో పాటు సీపీ అంబర్ కిషోర్ ఝా, ఎఫ్‌డీపీటీ శాంతారాం, జిల్లా అటవీ అధికారి శివ్‌ఆషిశ్ సింగ్, జిల్లా అధికారులు ఆయనకు స్వాగతం పలికారు.
‘హైకోర్టు ఆదేశాలు పాటించరా’
రామకృష్ణాపూర్: క్యాతనపల్లి మున్సిపల్ చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్ ఎన్నికలు ఈ నెల 24లోపు నిర్వహించాలన్న హైకోర్టు ఆదేశాలను ప్రభుత్వం పాటించడంలేదని మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ ఆరోపించారు. బెయిల్ షరతుల్లో భాగంగా ఆదివారం రామకృష్ణాపూర్ పోలీస్‌స్టేషన్‌కు హాజరై సంతకం చేసిన ఆయన విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలు వాయిదా వేయాలని చూస్తోందని, దీనిపై త్వరలో గవర్నర్‌ను కలుస్తామని తెలిపారు. అసెంబ్లీ, కౌ న్సిల్‌లో క్యాతనపల్లి, ఇబ్రహీంపట్నం, ఖానాపూర్ మున్సిపాలిటీల ఎన్నికల అంశాన్ని లేవనెత్తుతామ ని పేర్కొన్నారు. అవసరమైతే కోర్టు దిక్కరణ కింద మళ్లీ హైకోర్టును ఆశ్రయిస్తామని తెలిపారు. క్యాతనపల్లిలో 14 స్థానాలు బీఆర్‌ఎస్–సీపీఐ గెలుచుకు న్నా ఏడు స్థానాల్లో గెలిచిన కాంగ్రెస్ అధికార, పోలీ స్ బలాన్ని ఉపయోగించి తమపై లాఠీచార్జీ చేయించి అన్యాయంగా కేసులు పెట్టిందని ఆరోపించారు. నాయకులు మూల రాజిరెడ్డి, సుదర్శన్‌గౌడ్, రామిడి కుమార్, సంపత్ తదితరులున్నారు.


