రాష్ట్ర ప్రభుత్వం జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రకటించిన బడ్జెట్ ఇది. ఆరు గ్యారెంటీలు, 420 హామీల్లో ఒక్కటీ ఇందులో ప్రకటించలేదు. నిర్మల్‌లో స్వయంగా సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించిన బాసర జ్ఞానసరస్వతి యూనివర్సిటీ ఏర్పాటుపై ఊసెత్తలేదు. బాసర సరస్వతీమాత ఆలయ అభివృద్ధినీ పట్టించుకోలేదు.
– రామారావుపటేల్, ముధోల్ ఎమ్మెల్యే
అన్ని వర్గాలకు మేలు
బడ్జెట్ అన్నివర్గాల మేలుకోరేలా ఉంది. మహిళా సాధికారత, రైతు ల అభ్యున్నతి, ఇంటర్మీడియట్ స్థాయి వరకు విద్యార్థులకు మ ధ్యాహ్న భోజనం, కోటి 50లక్షల కుటుంబాలకు ఉచి తంగా రూ.5లక్షల వరకు బీమా, ఉద్యోగ, ఉపాధ్యా య పెన్షనర్లకు నగదు రహిత వైద్యం, నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పన లాంటి ప్రయోజనాలున్నాయి.
– కొట్టె శేఖర్, డీసీసీ అధికార ప్రతినిధి


