నిర్మల్‌ఖిల్లా: శ్రీపరాభవ నామ సంవత్సర ఉగా ది వేడుకల్లో భాగంగా జిల్లా కేంద్రంలోని ప్రి యదర్శిని నగర్‌లోని లయన్స్ క్లబ్ ఆవరణలో గురువారం రాత్రి 51 మంది కవులు, రచయితలు, కళాకారులు పాల్గొని కవితాగానం చేసి అ లరించారు. అనంతరం వారిని ప్రశంసాపత్రాలు, శాలువాలు, జ్ఞాపికలతో సత్కరించారు. కావేరి ఫౌండేషన్ చైర్మన్ అప్పాల చక్రధారి, తె లంగాణ రచయితల వేదిక జిల్లా అధ్యక్షుడు నే రెళ్ల హనుమంతు, ప్రధాన కార్యదర్శి వెంకట్, కవులు పత్తి శివప్రసాద్, అంబటి నారాయణ, కృష్ణంరాజు, చట్ల గజ్జారాం, తొడిశెట్టి పరమేశ్వర్, బొందిడి పురుషోత్తమరావు, భిక్షపతి నాయ క్, మునిమడుగుల రాజారావు, కామారపు జగదీశ్వర్, చెనిగారపు నాగరాజు, రాజేశ్వర్, శేఖర్, వేణుగోపాలకృష్ణ, దేవిప్రియ, లావణ్య, మమ త, కిరణ్మయి, శివరాణి, స్వాతి, పోతన్న, శ్రీని వాసాచార్య, నాగారాం, మురళీధర్, రవికాంత్, శ్రీనివాస్, వసంతరావు తదితరులున్నారు.
రవీంద్రభారతిలో జిల్లా కవులు..
తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో నిర్వహించిన వేడుకల్లో జిల్లా కవులు దామెర రాములు, తుమ్మల దేవరావు కవితాగా నంతో ఆహూతులను అలరించారు. అనంతరం వీ రిని సభాధ్యక్షుడు, కేంద్ర సాహితీ అకాడమీ అవార్డు గ్రహీత నందిని సిఽ దారెడ్డి, ప్రముఖ కవులు రూప్‌కుమార్, యాక ూబ్, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు నరసింహారెడ్డి, ప్రజావాగ్గేయకా రుడు గోరటి వెంకన్న సన్మానించారు.


