సహజ సాగుకు శ్రీకారం చుట్టాలి | - | Sakshi
Sakshi News home page

సహజ సాగుకు శ్రీకారం చుట్టాలి

Mar 19 2026 8:45 AM | Updated on Mar 19 2026 8:45 AM

● డీఏవో అంజిప్రసాద్‌

కుంటాల: రసాయన ఎరువులు, పురుగుల మందులు వాడకుండా రైతులు సహజ సాగుకు శ్రీకారం చుట్టాలని డీఏవో అంజిప్రసాద్‌ సూచించారు. మండలంలోని పెంచికల్‌పాడ్‌లో ప్రకృతి వ్యవసాయంపై రైతులకు బుధవారం అవగాహన కల్పించారు. జిల్లాలో 17 క్లస్టర్లను ఎంపిక చేయగా, కుంటాల మండలం అంబకంటి, పెంచికల్‌పాడ్‌ గ్రామాలు ఉన్నట్లు వివరించారు. ప్రతీ క్లస్టర్‌లో 125 మంది రైతులను ఎంపిక చేసి ఎకరం భూమిలో మూడేళ్లు ప్రకృతి వ్యవసాయం సాగు చేయాలని సూచించారు. ఈ రై తులకు జీవామృతం, ఘనామృతం, వేపనూనె పంపిణీ చేసి సాగుకు ప్రోత్సహిస్తామని పేర్కొన్నారు. సాగు చేస్తున్న ప్రతీ రైతుకు సేంద్రియ ధ్రువీకరణ పత్రాన్ని అందించనున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో స ర్పంచ్‌ హిమ్మత్‌రావుపటేల్‌, ఉప సర్పంచ్‌ రా ములు, ఏవో విక్రమ్‌, ఏఈవో గణేశ్‌, రిసో ర్స్‌పర్సన్‌ సాయినాథ్‌, రైతులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement