నిర్మల్‌చైన్‌గేట్: పెంబి మండలం చాకిరేవు గ్రా మంలో మౌలిక వసతులు కల్పించాలని ఆది వాసీలు, తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం నాయకులు కోరారు. ఈమేరకు కలెక్టర్ అభిలాష అభినవ్‌ను, అటవీశాఖ అధికారిని మంగళవారం కలిశారు. తమ సమస్యలు వినిపించా రు. చాకిరేవులో కనీస సదుపాయాలు లేక గిరి జనులు దుర్భర జీవనం సాగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్, రహదారులు, తాగునీరు, విద్య, వైద్య సదుపాయాలు లేవన్నారు. టైగర్ జోన్ కోర్ ఏరియా పేరుతో మౌలిక సదుపాయాల కల్పించడం లేదన్నారు. అటవీ సంరక్షణ పేరుతో ఆదివాసీల హక్కుల ను కాలరాస్తున్నారని తెలిపారు. గ్రామంలో సౌకర్యాలు కల్పించాలన్నారు. కార్యక్రమంలో తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడు కుడిమేత విజయ్, సీపీఎం జిల్లా నాయకుడు రాకేశ్‌యాదవ్, గ్రామ నాయకులు లక్ష్మణ్, లింబారవు, పవన్, నిర్మల, జంగు బాపు, సేసేరావు, జైతు, తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం నాయకులు పాల్గొన్నారు.


