భైంసారూరల్: మండలంలోని సుంక్లి రైతువేదికలో నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్ కార్యక్రమంలో భాగంగా జిల్లా వ్యవసాయ అఽ దికారి అంజిప్రసాద్ మంగళవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన 125 మంది రైతులకు సహజ వ్యవసాయ పద్ధతులు వివరించారు. పథకం కింద లభించిన సహజ వ్యవసాయ కిట్లను రైతులకు పంపిణీ చేశారు. సహజ వ్యవసాయంతో కలిగే ప్రయోజనాలను రైతులకు వివరించారు. కార్యక్రమంలో సుంక్లి సర్పంచ్ ఆదిరత్న, మండల వ్యవసాయ అధికారి గణేశ్, ఏఈవోలు, రైతులు పాల్గొన్నారు.


