న్యూస్‌రీల్
ట్రిపుల్ ఐటీలో వైద్య సదుపాయాలపై నిరసన
బాసర ట్రిపుల్ ఐటీలో సరైన వైద్య సదుపాయాలు లేవని విద్యార్థులు ఆందోళ చేశారు. వీసీ కార్యాలయం ముట్టడించారు.
ప్రకృతి వ్యవసాయంపై
దృష్టి పెట్టాలి
కుంటాల: రైతులు ప్రకృతి వ్యవసాయంపై దృష్టి సారించాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. మంగళవారం రైతునేస్తం కార్యక్రమంలో భాగంగా సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కుంటాల రైతు వేదికలో రైతులు పాల్గొన్నారు. ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ, కిట్స్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. సర్పంచ్ జక్కుల గజేందర్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ తాటి మహిపాల్, ఏవో విక్రమ్, ఏఈవోలు హర్షిత, గణేశ్, శ్రీనివాస్, చైతన్య, కృషి సఖి సిందూజ, విజయ, రైతులు పాల్గొన్నారు.
నిర్మల్‌చైన్‌గేట్/లక్ష్మణచాంద: అన్నదాతకు భరోసా దక్కింది. మూడు నెలల ఎదురుచూపులు ఫలించా యి. పెట్టుబడి సాయం ఈనెల 22న విడుదల చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. సిద్దిపేట జిల్లా నర్మెట్టలో సీఎం రేవంత్‌రెడ్డి మొదటి విడత నిధులు విడుదల చేయనున్నారు. జిల్లాలో 1,88,597 మంది రైతులకు లబ్ధి చేకూరుతుంది. ఇందుకు రూ.268.85 కోట్లకుపైగా నిధులు
మంజూరయ్యే అవకాశం ఉంది.
మొదటి విడత ఎకరానికే..
మొదటి దశలో ఎకరం భూమి ఉన్న రైతులకు రూ.6 వేల చొప్పున జమ చేస్తారు. 20 రోజుల తర్వాత రెండో విడతలో రెండెకరాల నుంచి పదెకరాలలోపు వారికి పెట్టుబడి డబ్బులు రైతుల ఖాతా ల్లో వేస్తారు. ఏప్రిల్ చివరివారంలో మూడో విడత 10 ఎకరాలపైన ఉన్నవారికి పెట్టుబడి అందిస్తారు. జిల్లాలో 2.80 లక్షల ఎకరాల సాగుభూమి ఉంది. ఇందులో 1,88,597 మంది రైతులు వ్యవసాయం చేస్తున్నారు. వీరికి రూ.268.85 కోట్లు జమకానున్నాయి. యాసంగి పంటలు ముమ్మరంగా సాగుతున్న వేళ పెట్టుబడి డబ్బులు ప్రకటించడం రైతులకు ఉపశమనం కల్పిస్తుంది.
అర్హులు దరఖాస్తు చేసుకోవాలి
రైతు భరోసాకు అర్హత ఉండి ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని రైతులు వెంటనే ఏఈవోల వద్ద దరఖాస్తు చేసుకోవాలి. 2026 ఫిబ్రవరి 28 వరకు కొత్త పట్టా పాస్‌బుక్ వచ్చిన రైతులు నమోదు చేసుకోవాలి. పాతవారు నమోదు చేసుకోవాల్సిన అవసరం లేదు. – అంజిప్రసాద్, డీఏవో
మండలాల వారీగా వానాకాలంలో
అందిన భరోసా వివరాలు..
మండలం రైతుల సంఖ్య పొందిన సొమ్ము
(రూ.లలో)
భైంసా 15,721 26,52,87,944
కుభీర్ 18,306 30,52,16,087
కుంటాల 8,186 13,18,81,741
దస్తురాబాద్ 5,385 5,79,71,675
కడెం 11,750 14,24,94,612
ఖానాపూర్ 9,721 10,04,45,998
పెంబి 6,032 9,47,66,837
బాసర 6,793 11,35,78,013
లోకేశ్వరం 12,772 17,11,59,230
ముధోల్ 12,99 20,70,79,416
తానూర్ 15,588 26,40,92,246
దిలావర్‌పూర్ 6,962 9,28,60,943
నర్సాపూర్(జి) 7,487 10,23,01,284
సోన్ 7,577 8,55,12,709
లక్ష్మణచాంద 9,066 9,95,38,344
మామడ 10,947 14,80,91,078
నిర్మల్ రూరల్ 9,119 9,85,59,549
నిర్మల్ అర్బన్ 561 42,57,472
కొత్తవారికి అవకాశం..
కొత్త పట్టాదారులకు రైతుభరోసా దరఖాస్తుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. 2026, ఫిబ్రవరి 28 వరకు భూమి కొనుగోలు చేసి పట్టాదారు పాస్‌బుక్ పొందినవారు అర్హులు. మార్చి 25 వరకు నమోదు చేసుకోవాలి. పట్టా పాస్‌బుక్, ఆధార్, బ్యాంకు ఖాతా వివరాలు, అప్లికేషన్ ఫారం, మొబైల్ నంబర్‌తో జిరాక్స్ కాపీలు తీసుకెళ్లి క్లస్టర్ ఏఈవోల వద్ద లేదా రైతు వేదికల్లో సమర్పించాలి. మండల వ్యవసాయ విస్తరణ అధికారులు ధ్రువీకరిస్తారు. బ్యాంకు వివరాలు అప్‌డేట్ చేస్తే డీబీటీ ద్వారా నేరుగా ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు జమవుతాయి.


