నిర్మల్: జిల్లా అభివృద్ధికి తమవంతు సహకారం అందిస్తామని తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్స్ ఇనిస్టిట్యూషన్స్ సొసైటీ అధ్యక్షుడు మహ్మద్ ఫహీమ్‌ఖురేషీ అన్నారు. జిల్లా గ్రంథాలయసంస్థ చైర్మన్ అర్జుమంద్‌అలీ ఆధ్వర్యంలో జిల్లాకేంద్రంలోని ఆర్‌ఆర్‌గార్డెన్స్‌లో మంగళవారం సాయంత్రం ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ముఖ్యఅతిథిగా ఫహీమ్‌ఖురేషీ హాజరయ్యారు. మున్సిపల్ వైస్‌చైర్మన్ అప్పాల గణేశ్‌చక్రవర్తి, మాజీమంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, డీసీసీ మాజీ అధ్యక్షుడు కూచాడి శ్రీహరిరావు తదితరులు పాల్గొన్నారు.
ఈద్గా, హజ్‌హౌస్‌లకు స్థలాలు..
జిల్లాకేంద్రంలో ముస్లింలు ఏళ్లుగా ఎదురుచూస్తున్న హజ్‌హౌస్, ఈద్గా నిర్మాణానికి వక్ఫ్‌బోర్డు స్థలాలను కేటాయిస్తూ వక్ఫ్‌బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల 6న గ్రంథాలయ చైర్మన్ అర్జుమంద్‌అలీ ఇచ్చిన వినతి మేరకు గాజుల్‌పేట గంజ్‌బక్ష్‌లో హజ్‌హౌస్‌కు 2.22 ఎకరాలు, ఈద్గాకు 5.01 ఎకరాలు కేటాయించింది. ఈమేరకు వక్ఫ్‌బోర్డు ఇచ్చిన ప్రొసీడింగ్ పత్రాలను మున్సిపల్ వైస్‌చైర్మన్, గ్రంథాలయ చైర్మన్‌కు ఫహీమ్‌ఖురేషీ అందించారు. కార్యక్రమంలో కరీంనగర్ గ్రంథాలయసంస్థ చైర్మన్ సత్తుమల్లేశ్, కౌన్సిలర్లు, నాయకులు, ముస్లిం మతపెద్దలు పాల్గొన్నారు.


