దస్తురాబాద్: విహార యాత్రలతో విజ్ఞానం పెరుగుతుంది. అందుకే పాఠశాల స్థాయిలో విద్యార్థులను క్షేత్రస్థాయికి తీసుకెళ్లి ప్రత్యక్ష అనుభవం కల్పిస్తారు. దస్తురాబాద్ కేజీబీవీ ఎస్‌వో తిరుమల నేతృత్వంలో విద్యార్థులను ఉమ్మడి వరంగల్ జిల్లాకు విహార యాత్రకు తీసుకెళ్లారు. రామప్ప, వేయిస్తంభాలగుడి, వరంగల్ ఖిల్లా, భద్రకాళి ఆలయం, లక్నవరం సరస్సు సందర్శించారు. వాటి ప్రధాన్యతను ఉపాధ్యాయులు వివరించారు. ఇందులో ఉపాధ్యాయులు సులోచన, రమ్య, అర్చన, రాధ, ప్రియాంక, శ్వేత, నాన్‌టీచింగ్ స్టాఫ్ ప్రియాంక, శ్రావణి, శోభ, వినోద, స్వరూప, పూర్ణ పాల్గొన్నారు.


