నిర్మల్‌చైన్‌గేట్: సమస్యల పరిష్కారం కోసం ఆశ వర్కర్లు సీఐటీయూ ఆధ్వర్యంలో చేపట్టిన 48 గంటల ధర్నా మంగళవారం ముగిసింది. రెండో రోజు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి బొమ్మెన సురేశ్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఆశ వర్కర్లపై మొండి వైఖరి వీడాలన్నారు. వెంటనే సమస్యలు పరిష్కరించి సుప్రీంకోర్టు గైడ్‌లైన్స్ ప్రకారం రూ.26 వేల కనీస వేతనం అమలు చేయాలన్నారు. సమాజంలో ఆశ వర్కర్ల పాత్ర గణనీయమైనదని వారిని రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం సిగ్గుచేటన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాకముందు ఆశ వర్కర్లకు కనీస వేతనం, పని భద్రత, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తామని హామీ ఇచ్చి.. అధికారంలోకి వచ్చాక మర్చిపోయిందన్నారు. కార్యక్రమంలో యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి వి.శైలజ, ఆశ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సుజాత, పి.గంగమణి, ఉపాధ్యక్షులు విజయ, చంద్రకళ, ఇంద్రమ్మ, నంద, సుగ్న, పద్మ, సహాయ కార్యదర్శులు కమల, రామలక్ష్మి మంగ, శ్యామల, సులోచన, అనసూర్య జ్యోతి, వినోద పాల్గొన్నారు.


