నిర్మల్‌చైన్‌గేట్: దేశాభివృద్ధికి జనగణన అత్యంత కీలకమని కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. భార త జనగణన–2027కి సంబంధించి, కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం అధికారులకు శిక్షణ నిర్వహించారు. కలెక్టర్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అధికారులు చేపట్టే జనగణన ఆధారంగానే ప్రభుత్వం ప్రజలకు అవసరమయ్యే పథకాల అమలు, మౌలిక సదుపాయాల కల్పన, ఇతర ప్రజాప్రయోజనాల రూపకల్పనకు ఆధారమన్నారు. పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. జనగణనలో గృహాల గుర్తింపు, జనగణన వివరాల నమోదులో తప్పులు ఉండకూడదన్నారు. మాస్టర్ ట్రైనర్లు అందించే ప్రతీ అంశాన్ని అవగాహన చేసుకోవాలన్నా రు. జనగణన బాధ్యతగా నిర్వర్తించి, విజయవంతం చేయాలని సూచించారు. మాస్టర్ ట్రైనర్లు అధి కారులకు జనగణనకు సంబంధించి అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో రత్నకళ్యా ణి, సీపీవో జీవరత్నం, డీపీవో శ్రీనివాస్, జెడ్పీ సీఈ వో శంకర్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
కూరగాయల సాగువిస్తీర్ణం పెంచాలి
నిర్మల్‌చైన్‌గేట్: రైతులు జిల్లాలో కూరగాయల సాగువిస్తీర్ణం పెంచాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. తన చాంబర్‌లో పలువురు రైతులకు, ఉచితంగా ఐదు రకాల కూరగాయల విత్తనాల కిట్లను సోమవారం అందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఐదు రకాల కూరగాయల విత్తనాలు గల కిట్లతో రైతులకు మేలు కలుగుతుందన్నారు. ఈ విత్తనాల ద్వారా నాణ్యమైన కూరగాయలు ఉత్పత్తి అవుతాయని తెలిపారు. ఉద్యానవన పంటల అధికారులు మండలాల్లో ఈ విత్తనాల కిట్లు పంపిణీ చేస్తారని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా ఉద్యానవన అధికారి రమణ, సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.


