● బోరిగాం గ్రామంలో ఘటన
తానూరు: ఆ చిన్నారి ఇంటి ఆవరణలో ఆడుకుంటోంది. అప్పడే ఇంట్లో నుంచి వచ్చిన తండ్రి బయటకు వెళ్లేందుకు కారును రివర్స్ తీస్తున్నాడు. ఇంతలో కారు శబ్దం విని పరిగెత్తుకుంటూ వచ్చిన చిన్నారి.. వెనకాల నిలబడింది. గమనించని తండ్రి రివర్స్ పోనివ్వడంతో చిన్నారి టైరుకిందపడింది. కూతురు ఏడుపు విన్న తండ్రి కారు ఆపి వెళ్లి చూడగా టైరుకింద నలిగిపోయింది. ఈ హృదయవిదారక సంఘటన బోరిగాంలో జరిగింది. గ్రామానికి చెందిన అవధూత్ సోమవారం ఉదయం తన ఇంటి ముందు నిలిపిన కారును పక్కకు తరలించేందుకు రివర్స్‌లో తీస్తుండగా, అప్పుడే ఆడుకుంటూ వచ్చిన కుమార్తె శ్రీహాన్సి(16 నెలలు) కారు వెనక నిలబడింది. గుర్తించని అవధూత్ కారును రివర్స్ తీశాడు. దీంతో చిన్నారి టైరుకిందపడింది. వెంటనే అప్రమత్తమైన తండ్రి కారు నిలిపి వెళ్లి చూడగా చిన్నారి తీవ్రంగా గాయపడింది. స్థానికుల సహాయంతో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతిచెందింది.


