నిర్మల్
న్యూస్‌రీల్
క్రీడల్లో ప్రతిభ కనబర్చాలి
నిర్మల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల విద్యార్థులకు క్రీడల పోటీలు నిర్వహించారు.
కలెక్టర్‌ను సన్మానించిన
ఎంపీడీవోలు
నిర్మల్‌చైన్‌గేట్: గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించినందుకు కలెక్టర్ అభినాష్ అభినవ్, భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్‌కుమార్‌ను అన్ని మండలాల ఎంపీడీవోలు శనివారం కలెక్టరేట్‌లోని సన్మానించారు. మూ డు దశల్లో నిర్వహించిన గ్రామ పంచాయతీ ఎన్నికలు ఎక్కడా ఇబ్బందులు లేకుండా, ప్రశాంత వాతావరణంలో పూర్తయ్యాయని ఎంపీడీవోలు పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో అధికారులకు కలెక్టర్ ఇచ్చిన ప్రోత్సాహం గొప్పదని, ఆమె మార్గదర్శకత్వంలో జిల్లాలో ఎన్నికల ప్రక్రియ విజయవంతమైందని తెలి పారు. అందరి సహకారంతో ఎన్నికలు విజయవంతంగా నిర్వహించామని ఎంపీడీవోలను కలెక్టర్ అభినందించారు. కార్యక్రమంలో ఎంపీడీవోలు లక్ష్మీకాంత్, గజానన్, నీరజ్‌కుమార్, రాధ, అరుణ, రమాకాంత్ పాల్గొన్నారు.
ఈ ఫొటో ఒక్కటి చాలు. నిండుగా పారుతున్న కడెం నదిని థర్మకోల్‌తో చేసిన తెప్పపై దాటి వెళ్తున్నారు. ఇందులో ఒకరిద్దరే మగవాళ్లు. మిగిలిన వాళ్లంతా మహిళలే. ఇంతకు ముందెన్నడూ వారికి ఇంతదూరం ఉన్న ఆ ఊరు తెలియదు. కఠినమైన ఈ దారీ తెలియదు. అయినా.. విధినిర్వహణ కోసం అలా వెళ్లారంతే. ఈనెల 11న నిర్వహించిన తొలివిడత పంచాయతీ ఎన్నికల కోసం పెంబి మండలంలోని కడెం నది అవతలివైపు ఉన్న అటవీగ్రామం యాపల్‌గూడ పంచాయతీకి మహిళ సిబ్బంది ఇలా ప్రమాదకరమైన తెప్ప ప్రయాణం చేశారు. వీరి పరిస్థితి తెలుసుకుని జిల్లా ఎన్నికల పరిశీలకురాలు ఆయేషామస్రత్ ఖానం స్వయంగా వచ్చి జాగ్రత్తగా వెళ్లివచ్చేలా పర్యవేక్షించారు.
నిర్మల్: జిల్లాలో పల్లెపోరు సాఫీగా పూర్తికావడం వెనుక ఎంతోమంది శ్రమ దాగిఉంది. జిల్లా ఉన్నతాధికారులు, ఉద్యోగులతోపాటు క్షేత్రస్థాయిలో పనిచేసిన సిబ్బంది పడ్డ కష్టమూ ఉంది. దూరభారాన్ని, చలి వాతావరణాన్ని, కఠినమైన పరిస్థితులనూ లెక్కచేయకుండా పోలింగ్ కేంద్రాలకు ఒకరోజు ముందే వెళ్లి, రాత్రి అక్కడే బసచేసి, వేకువజామునే ఎన్నికలకు అన్నీ సిద్ధం చేశారు. పొద్దున ఏడింటి నుంచి ఒంటిగంట వరకు పోలింగ్ నిర్వహించి, మళ్లీ మధ్యాహ్నం రెండింటి నుంచి రాత్రిదాకా కౌంటింగ్, రీకౌంటింగ్‌లూ చేసి ఆ ఊళ్ల ఐదేళ్ల భవిష్యత్తును ప్రకటించి వచ్చారు. ఇలాంటి కఠినమైన పంచాయతీపోరును విజయవంతంగా నడిపించిన వారిలో ఉన్నతాధికారులతోపాటు సిబ్బందిలోనూ మహిళలే అధికంగా ఉండటం విశేషం.
పంచాయతీలో మహిళాశక్తి..
జిల్లాలో మొత్తం 400 గ్రామపంచాయతీలు ఉండగా, దస్తురాబాద్ మండలం పెర్కపల్లిలో నామినేషన్‌లు రాని కారణంగా ఎన్నిక నిలిపివేశారు. మిగిలిన 399 జీపీల్లో 195 చోట్ల మహిళా అభ్యర్థులు గెలుపొందడం గమనార్హం. జనాభాలోనే కాకుండా పాలనలోనూ మహిళల శక్తి పెరుగుతోంది. రిజర్వేషన్ వచ్చిన పంచాయతీల్లోనే కాకుండా జనరల్ స్థానాల్లోనూ మహిళ అభ్యర్థులు గెలుపొందారు. ఈసారి పంచాయతీ బరిలో దిగిన మహిళల్లో నిరక్షరాస్యులతోపాటు ఏకంగా డిగ్రీ, పీజీలు చదివినవారూ ఉన్నారు.
ముగ్గురు ఉన్నతాధికారులూ..
జిల్లాలో పంచాయతీ ఎన్నికలను ముందుండి నడిపించిన ముగ్గురు ఉన్నతాధికారులూ మహిళలే కావడం మరో విశేషం. కలెక్టర్ అభిలాషఅభినవ్, ఎస్పీ జానకీషర్మిలతోపాటు రాష్ట్ర ఎన్నికల కమిషన్ నియమించిన జిల్లా ఎన్నికల పరిశీలకురాలు ఆయేషా మస్రత్ ఖానం ఈ ముగ్గురు మహిళాఅధికారులు అనుక్షణం పర్యవేక్షిస్తూ.. పంచాయతీలను పరిశీలిస్తూ.. విజయవంతం చేశారు.
పిల్లలు, కుటుంబాలను వదిలి..
ఎన్నికల డ్యూటీలు నిర్వర్తించిన మహిళల్లో చాలామంది చిన్న పిల్లలను, వృద్ధాప్యంలో ఉన్న పెద్దలను వదిలి విధులకు వచ్చారు. తూర్పు నుంచి పడమరకు, ఈ కొన నుంచి ఆ చివరనకు ఇలా చాలామంది మహిళలకు దాదాపు 100 కి.మీ. దూరంపైనే డ్యూటీలు పడ్డాయి. అయినా.. చాలామంది అతివలు దారి కూడా సరిగా లేని అటవీ గ్రామాలకూ వెళ్లారు. వణికిస్తున్న చలిలో రాత్రిపూట అలాంటి మారుమూల గ్రామాల్లో అరకొర వసతుల్లో బసచేశారు. వేకువజామునే పోలింగ్‌కు సిద్ధమై రోజంతా శ్రమించి విజయవంతంగా పూర్తిచేశారు. రాత్రి 10–11గంటల వరకూ కౌంటింగ్ చేసి ఏ అర్ధరాత్రికో ఇంటికి చేరుకున్నారు.
ప్రజల సహకారంతో..
పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా పూర్తిచేసేందుకు సహకరించిన జిల్లా ప్రజలకు ముందుగా ధన్యవాదాలు. అన్నిశాఖలు, అధికారులు, సిబ్బంది సహకారంతో పోలింగ్ విజయవంతంగా పూర్తిచేశాం. ఈ స్ఫూర్తితో రానున్న ఎన్నికలనూ పూర్తిచేస్తామన్న భరోసా ఏర్పడింది.
–అభిలాషఅభినవ్, కలెక్టర్
సమష్టి కృషితో..
పంచాయతీ ఎన్నికలు విజయవంతంగా పూర్తిచేయడంలో సమష్టి కృషి ఉంది. జిల్లా అధికారులు, పోలీసు యంత్రాంగం అంతా కలిసి ప్రశాంతంగా ఎన్నికలను పూర్తిచేశాం. పోలింగ్ సాఫీగా పూర్తికావడానికి ప్రజలు కూడా సంపూర్ణంగా సహకరించారు. –జానకీషర్మిల, ఎస్పీ
నిర్మల్
నిర్మల్
నిర్మల్
నిర్మల్
నిర్మల్


