అన్ని పండుగలు జరుపుకోవాలి
నిర్మల్‌టౌన్: కుల, మత భేదాలు లేకుండా ప్రతి ఒక్కరూ అన్ని పండుగలు జరుపుకోవాలని ఎస్పీ జానకీషర్మిల అన్నారు. అన్ని మతాల ప్రజలు మత సామరస్యాన్ని పాటిస్తూ.. పండగలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలన్నారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ ప్రధాన కార్యాలయంలో శనివారం సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. ముందుగా పలువురు యేసు కీర్తిని చాటే పాటలు పాడారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. క్రీస్తు జననానికి గుర్తుగా ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే పండగ క్రిస్మస్ అని అన్నారు. క్రిస్టియన్స్ అనేది ఒక మతం కాదని, ఒక జీవన విధానమని పేర్కొన్నారు. జిల్లా పోలీస్ శాఖ తరపున వినాయక చవితి, దసరా, దీపావళి, రంజాన్, బక్రీద్, క్రిస్మస్‌తోపాటు అన్ని పండుగలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. అనంతరం జిల్లా పోలీస్ అధికారులు ఎస్పీతో కేక్ కట్ చేయించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఉపేంద్రారెడ్డి, ఏవో యూనిస్ అలీ, ఇన్‌స్పెక్టర్లు ప్రవీణ్‌కుమార్, కృష్ణ, నైలు, ఆర్‌ఎస్సైలు రవికుమార్, రాజశేఖర్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.


