డిసెంబర్‌లో ఫుల్ కిక్కు!
మద్యం వ్యాపారులకు కలిసొచ్చిన పంచాయతీ ఎన్నికలు
గతేడాదితో పోల్చితే పెరిగిన విక్రయాలు
18 రోజుల్లోనే మద్యంపై ఖజానాకు రూ.47.52 కోట్లు
నెలాఖరు నాటికి మరో రూ.20 కోట్లు ఆదాయం వస్తుందని అంచనా
నిర్మల్‌చైన్‌గేట్: పంచాయతీ ఎన్నికల ఉత్సాహం, చలి ప్రభావంతో జిల్లాలో మద్యం అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. డిసెంబర్ 18 వరకు జిల్లాలో మద్యం అమ్మకాల ద్వారా ప్రభుత్వానికి రూ.42.57 కోట్ల ఆదాయం వచ్చింది. క్రిస్మస్, కొత్త సంవత్సర వేడుకలతో నెలాఖరులో మరో రూ.20 కోట్లు అదనంగా వస్తుందని ఆబ్కారీ శాఖ అంచనా వేస్తోంది. .
లిక్కర్‌కే మందుబాబుల మొగ్గు..
ఐఎంఎఫ్‌ఎల్ లిక్కర్ (విస్కీ, బ్రాండీ, రమ్) అమ్మకాలు టాప్ పొజిషన్‌లో ఉన్నాయి. 28వ తేదీ డేటా ప్రకారం 43,966 కేసులు అమ్ముడయ్యాయి. బీర్‌కు 33,481 కేసులు మాత్రమే. గ్రామీణ బెల్ట్ షాపులు కూడా ఈ పెరుగుదలకు కారణం. ఎన్నికల దావత్‌లలో హార్డ్ డ్రింక్స్‌కే ప్రాధాన్యత ఇచ్చారు.
అభ్యర్థుల పోటీపై ఖర్చు పోటీ
ఎన్నికల షెడ్యూల్ ప్రకటన తేదీ నుంచే అభ్యర్థులు ఊరంతా మందు పార్టీలు ఏర్పాటు చేశారు. ఓటర్లను ఆకర్షించేందుకు పోటాపోటీగా లిక్కర్ పంపారు. ప్రచారానికి వచ్చిన వారికి చుక్క, ముక్కతో దావత్‌లు ఏర్పాటు చేశారు. దీంతో అమ్మకాలు పెరిగాయి. నవంబర్ 26 నుంచి 650 బెల్ట్ షాపులు మూసివేశారు. ఎన్నికలకు 48 గంటల ముందు మద్య దుకాణాలు కూడా ఆగాయి. అయినా అభ్యర్థులు ముందుగానే స్టాక్ చేసుకుని, దూర ప్రాంతాల నుంచి లిక్కర్ తీసుకొచ్చారు. పోలీసు–ఎకై ్సజ్ నిఘా మధ్య కూడా అమ్మకాలు ఆగలేదు.
ఈనెల 18 వరకు
జిల్లాలో లిఫ్ట్ చేసిన మద్యం
మొత్తం మద్యం షాపులు 47
జిల్లాలోని బార్లు 9
ఐఎంఎల్ 43,966 బాక్సులు
బీర్లు 33481 బాక్సులు
సెల్ వాల్యూ రూ.42,57,56,150


