మైదానాన్ని పరిశీలించిన స్పోర్ట్స్ అధికారి
సారంగపూర్: మండలంలోని జామ్ గ్రామంలో గ్రామస్తుల సహకారంతో స్థానిక యువకులు ఏర్పాటు చేసుకున్న క్రీడా మైదానాన్ని జిల్లా స్పోర్ట్స్ అధికారి శ్రీకాంత్‌రెడ్డి శనివారం పరిశీలించారు. క్రీడా మైదానం ఏర్పాటు చేసిన స్థలం వివరాలు, ఇప్పటి వరకు యువకులు, గ్రామస్తులు మైదానం కోసం చేసిన ఖర్చుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా యువకులు మాట్లాడుతూ తమకు అథ్లెటిక్స్ పోటీలకు సంబంధించిన అన్నిరకాల పరికరాలు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. జిల్లా స్పోర్ట్స్ అథారిటీ తరఫున తాము ఏర్పాటు చేసుకున్న క్రీడా మైదానం అభివృద్ధి చేయాలని విన్నవించారు. స్పందించిన డీవైఎస్‌వో కనీసం 5 ఎకరాల స్థలం జిల్లా స్పోర్ట్స్ అథారిటీపేరిట రిజిస్ట్రేషన్ చేయించి ఇస్తే తప్పకుండా మైదానం అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. క్రీడా పరికరాలు సమకూరుస్తామన్నారు. కార్యక్రమంలో కోచ్ సామ్యూల్, యువకులు రాము, మాసురాజు, రెడ్ల వినయ్, బలాష్టు నవీన్, కరిపె ప్రశాంత్, వీడీసీ సభ్యులు ఆడెపు మహేందర్, సుకానంద్ తదితరులు పాల్గొన్నారు.


