ట్రిపుల్ ఐటీ అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు డాక్టరేట్
బాసర: బాసర ట్రిపుల్ ఐటీ ఆంగ్ల విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న కుమ్మరి కృష్ణప్రసాద్‌కు తెలంగాణ విశ్వవిద్యాలయం డాక్టరేట్ అందించింది. విశ్వవిద్యాలయం ఆంగ్ల విభాగ ప్రొఫెసర్ కేవీ.రమణాచారి పర్యవేక్షణలో ‘సెల్ఫ్, సొసైటీ అండ్ ది మిడిల్ క్లాస్ ఇన్ ది సెలెక్టెడ్ నావల్స్ ఆఫ్ మంజుకపూర్’ అనే పరిశోధన అంశంపై కృష్ణ ప్రసాద్ సమర్పించిన సిద్ధాంత గ్రంధానికి గాను తెలంగాణ విశ్వవిద్యాలయం ఈ పీహెచ్‌డీ ప్రదానం చేసింది. ఈ పరిశోధనలో భాగంగా కృష్ణప్రసాద్ పలు జాతీయ, అంతర్జాతీయ సదస్సుల్లో పాల్గొనడంతోపాటు, స్కోపస్ ఇండెక్స్‌డ్ ఎల్సివియర్ రీసెర్చ్ జర్నల్స్‌లో ఎనిమిది కంటే ఎక్కువ పరిశోధన వ్యాసాలను ప్రచురించి విశేష గుర్తింపు పొందారు. ఆయనను ఇన్‌చార్జి వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్, ఓఎస్డీ ప్రొఫెసర్ మురళీదర్శన్ అభినందించారు. కార్యక్రమంలో అసోసియేట్ డీన్ ఎస్.విఠల్, అధ్యాపకులు పాల్గొన్నారు.


