
వైద్యులు సమయపాలన పాటించాలి
నిర్మల్‌చైన్‌గేట్: వర్షాల కారణంగా రోగుల సంఖ్య పెరిగే అవకాశముందని, వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించి మెరుగైన సేవలందించాలని కలెక్టర్ అభిలాష అభినవ్ సూచించారు. బుధవారం పట్టణంలోని బంగల్‌పేట్ ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించారు. రోగుల నమోదు, రోగనిర్ధారణ పరీక్షలు, మందుల పంపిణీ తదితర అంశాల గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నా రు. రిజిస్టర్లు పరిశీలించి సమగ్రంగా నిర్వహించాల ని సూచించారు. మందుల గదిని పరిశీలించి అందుబాటులో ఉన్న ఔషధాల వివరాలు, గడువు తేదీల ను తెలుసుకున్నారు. టీకాల గదిని తనిఖీ చేశారు. పారిశుధ్యం విషయంలో పటిష్ట చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ‘ప్రైవేట్’కు దీటుగా అన్ని రకాల వైద్యసౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని భరోసా ఇచ్చారు. డీఎంహెచ్‌వో రాజేందర్, మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్‌గౌడ్, వైద్యాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.