
ఆయిల్‌పామ్ పరిశ్రమ ఏర్పాటు చేయాలి
నిర్మల్‌చైన్‌గేట్: జిల్లాలో ఆయిల్‌పామ్ పరిశ్రమ ఏర్పాటు చేయాలని డీసీసీ అధ్యక్షుడు కూచాడి శ్రీహరిరావు హైదరాబాద్‌లో జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కష్ణారావును కోరారు. ఈ మేర కు బుధవారం ఆయనను కలిసి వినతిపత్రం అందజేశారు. జిల్లాలో వేల ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు చేస్తున్నారని తెలిపారు. ఇందుకో సం సోన్ మండలం పాక్‌పట్ల గ్రామంలో ఫ్యాక్ట రీ నిర్మాణానికి స్థల సేకరణ జరిగిన తర్వాత పరిశ్రమ నిర్మాణం నిలిచిపోయిందని పేర్కొన్నారు. పరిశ్రమ ఇక్కడి నుంచి తరలిపోతుంద ని రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని తె లిపారు. పాక్‌పట్ల గ్రామంలో సేకరించిన స్థ లం పరిశ్రమ ఏర్పాటుకు అనుకూలం కాకుంటే మామడ, నర్సాపూర్ (జి) మండలాల్లో స్థల సే కరణకు అధికారులు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. జిల్లాలో ఆయిల్ పామ్ పరిశ్రమ ఏర్పా టు చేయాలని కోరారు. శ్రీహరిరావు వెంట నిర్మల్, భైంసా ఏఎంసీ చైర్మన్లు సోమా భీమ్‌రెడ్డి, ఆనంద్‌రావు పాటిల్ ఉన్నారు.
మంత్రి జూపల్లికి వినతిపత్రం ఇస్తున్న శ్రీహరిరావు