
ఒక్కరోజు శాస్త్రవేత్తగా పొన్కల్ విద్యార్థిని
మామడ: హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ సె ల్యులార్ అండ్ మాలిక్యూలర్ బయోలజీని సందర్శించే అవకాశం పొన్కల్ జెడ్పీ హైస్కూల్‌కు చెందిన విద్యార్థిని మేకల కావ్యకు దక్కింది. ఆ న్‌లైన్‌లో కావ్య దరఖాస్తు చేయగా ఆమెకు పి లుపురావడంతో గైడ్ టీచర్‌తో కలిసి హైదరా బాద్‌లోని సీసీఎంబీని బుధవారం సందర్శించింది. అందులో శాస్త్రవేత్తలతో కలిసి ఒక్కరో జు శాస్త్రవేత్తగా పనిచేసే, సెమినార్‌లో పాల్గొనే అవకాశం దక్కించుకుంది. ఈ అవకాశం రా వడం తనకు ఆనందంగా ఉందని కావ్య తెలి పింది. కావ్యను పాఠశాల హచ్‌ఎం అరవింద్‌కుమార్, ఉపాధ్యాయులు, గ్రామ విద్యాభివృద్ధి కమిటీ సభ్యులు అభినందించారు.