
భైంసా సబ్ కలెక్టర్‌గా సంకేత్‌కుమార్
భైంసాటౌన్: భైంసా సబ్ కలెక్టర్‌గా అజ్మీరా సంకేత్‌కుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణారావు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం భైంసా ఆర్డీవోగా సీహెచ్ కోమల్‌రెడ్డి ఉండగా, ఆయన స్థానంలో సబ్ కలెక్టర్‌గా సంకేత్‌కుమార్ రానున్నారు. సివిల్స్–2022లో రెండో ప్రయత్నంలోనే 35 ర్యాంక్ సా ధించి ఐఏఎస్‌గా ఎంపికై న సంకేత్‌కుమార్‌ది మంచిర్యాల జిల్లా దండేపల్లి గ్రామం. గిరిజన కుటుంబానికి చెందిన సంకేత్‌కుమార్ తండ్రి ప్రేమ్‌సింగ్ హార్టికల్చర్ డిపార్ట్‌మెంట్‌లో డిప్యూటీ డైరెక్టర్‌గా, తల్లి సవిత ఇస్రోలో పనిచేశారు.