
వనమహోత్సవాన్ని సక్సెస్ చేయాలి
● కలెక్టర్ అభిలాష అభినవ్ ● వనమహోత్సవం, ఇందిరమ్మ ఇళ్లపై అధికారులతో సమీక్ష
నిర్మల్‌చైన్‌గేట్: వనమహోత్సవాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో వనమహోత్సవం, ఇందిరమ్మ పథకం తదితర అంశాలపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. వనమహోత్సవంలో భాగంగా ఆయా శాఖల ఆధ్వర్యంలో విరివిగా మొక్కలు నాటాలని సూచించారు. జిల్లాలో ఈ సంవత్సరం 69.55 లక్షల మొ క్కలు నాటేలా ప్రణాళికలు రూపొందించినట్లు చె ప్పారు. ఇప్పటివరకు ఆయా శాఖల ఆధ్వర్యంలో 44శాతం మొక్కలు నాటినట్లు పేర్కొన్నారు. మరో 15రోజుల్లోపు మొక్కలు నాటే ప్రక్రియ పూర్తిచేసి జి యోట్యాగ్ చేయాలని సూచించారు. హార్టికల్చర్ మొక్కలు నాటేందుకు వ్యవసాయశాఖ సహకారం తీసుకోవాలని ఎంపీడీవోలకు తెలిపారు. మొక్కలు నాటిన వెంటనే వివరాలు అటవీశాఖ అధికారులకు పంపించాలని సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలని, మార్కౌట్ పూర్తి చే సిన ఇండ్ల పనులు తక్షణమే ప్రారంభించాలని సూ చించారు. ఇసుక కొరత రాకుండా తహసీల్దార్లు తగి న చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన లబ్ధిదారుల సర్వే త్వరగా పూర్తి చే యాలని ఎంపీడీవోలను ఆదేశించారు. అదనపు క లెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిశోర్‌కుమార్, డీఎఫ్‌వో నా గిని భాను, ఆర్డీవోలు రత్నకల్యాణి, కోమల్‌రెడ్డి, డీ ఈవో రామారావు, జెడ్పీ సీఈవో గోవింద్, డీపీవో శ్రీనివాస్, ఏడీ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్ ఆర్.సుదర్శన్ తదితరులు వీసీలో ద్వారా పాల్గొన్నారు.