
ఇక్కడ కాస్త నయం..
నిర్మల్, ఖానాపూర్‌తో పోలిస్తే భైంసా పట్టణంలో మొక్కల పెంపకం, నిర్వహణ కాసింత నయమే. డివైడర్ మధ్య మొక్కల పెంపకం బాగానే కొనసాగుతోంది. చెట్లు లేక ప్రకృతివనం, పార్కులు కళావిహీనంగా మారాయి.
పనికొచ్చే చెట్లే లేవన్నట్లుగా.. జిల్లాకేంద్రంలో ఎటు చూసినా కోనోకార్పస్ చెట్లనే పెంచారు. వాటితో కలిగే లాభమేంటో ఎవరికీ స్పష్టత లేదు. కానీ నష్టాలపై మాత్రం చాలా విషయాలు ప్రచారంలో ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో భూగర్భ జలాలు, మనిషి ఆరోగ్యానికీ ముప్పుగా ఈ చెట్లను పేర్కొంటున్నారు. కానుగ, కదంబం వంటివి ఉన్నా ఆవైపు ఆలోచన చేయడం లేదు. మొక్కలు నాటడం బాగానే ఉంది. కానీ.. చాలాచోట్ల విద్యుత్‌లైన్ల కింద నాటుతున్నారు. దీంతో అవి కాస్త పెరిగి పెద్దవి కాగానే కరెంట్ వైర్లకు తాకుతున్నాయి. దీంతో విద్యుత్ సిబ్బంది ఆ చెట్లను మొదటికే కొట్టేస్తున్నారు. జిల్లాకేంద్రంలోని ప్రియదర్శినీనగర్‌తో పాటు పలు కాలనీల్లో ఇలాగే ఏపుగా పెరిగిన చెట్లను వైర్లకు తాకుతున్నాయంటూ కొట్టేశారు. కొన్నిచోట్ల మళ్లీమళ్లీ అదే పనిచేస్తున్నారు. తాజా సీజన్‌లోనూ పలుచోట్ల కరెంట్ వైర్ల కిందనే అధికారులు మొక్కలు నాటిస్తుండటం గమనార్హం.
పదేపదే అదే తప్పు..