
పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
నిర్మల్‌టౌన్: అర్హులంతా ప్రభుత్వ పథకాలను సద్వి నియోగం చేసుకోవాలని సీనియర్ సివిల్ జడ్జి రాధి క సూచించారు. మహాలక్ష్మి పథకం కింద బుధవా రం నాటికి 200కోట్ల మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేసినందున నిర్మల్ బస్టాండ్‌లో వేడుకలు నిర్వహించారు. జడ్జి హాజరై మాట్లాడుతూ.. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని సూచించారు. కార్యక్రమంలో డిపో మేనేజర్ పండరి, మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు లక్ష్మి, డిపో అసిస్టెంట్ మేనేజర్ దేవపాల, అసిస్టెంట్ ఇంజినీర్ నవీన్‌కుమార్, స్టేషన్ మేనేజర్ ఏఆర్ రెడ్డి, సిబ్బంది, మహిళా ప్రయాణికులు పాల్గొన్నారు.
చట్టాలపై అవగాహన
జిల్లా కేంద్రంలోని పెన్షనర్ భవనంలో రిటైర్డ్ ఉద్యోగులకు చట్టాలపై సీనియర్ సివిల్ జడ్జి రాధిక అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కోర్టు కేసుల్లో మధ్యవర్తిత్వం సులభ పరి ష్కార మార్గమని పేర్కొన్నారు. రాష్ట్ర న్యాయ సేవా ధికార సంస్థ ఆదేశాల మేరకు కోర్టు కేసుల్లో మధ్యవర్తిత్వం గురించి ప్రజలు, కక్షిదారులకు అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. మధ్యవర్తిత్వం ద్వారా సమయం, డబ్బు ఆదా అవుతుందని సూచించారు. రిటైర్డ్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు ఎంసీ లింగన్న, రిటైర్డ్ ఉద్యోగులు పాల్గొన్నారు.