
రాష్ట్రస్థాయి బాక్సింగ్ పోటీలకు ఎంపిక
నిర్మల్‌టౌన్: జిల్లా కేంద్రంలోని సహస్ర బా క్సింగ్ అకాడమీలో మంగళవారం రాష్ట్రస్థాయి బాక్సింగ్ ఎంపిక పోటీలు నిర్వహించారు. ఇందులో ప్రతిభ కనబర్చినవారిని రాష్ట్రస్థాయి పో టీలకు ఎంపిక చేశారు. బాలికల విభాగంలో బి.అర్చన (30–33) కిలోల బరువులో, ఎల్. అర్చన, (35–37), డి.అశ్విత, (33–35)లో, డి.యోగిత (37–40)లో, పి.లహరిక, (40–43)లో, ఎస్.దీక్షిత (43–46) బరువు విభాగంలో ఎంపికయ్యారు. బాలుర విభాగంలో ధ్రు వ (49–52) బరువులో, ఎస్.సౌరన్‌రెడ్డి(49–52), ఏ శ్రీనిధ్( 58–61) బరువులలో ఎంపికయ్యారు. వీరు ఈనెల 25 నుంచి 27 వరకు హై దరాబాద్‌లో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొ ంటారు. ఎంపికై న క్రీడాకారులను జిల్లా క్రీడల శాఖ అధికారి శ్రీకాంత్‌రెడ్డి, బాక్సింగ్ సెక్రటరీ చందుల స్వామి ప్రత్యేకంగా అభినందించారు.