
పీఆర్సీ అమలుకు సీఎం చొరవ చూపాలి
● ఎస్టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు జుట్టు గజేందర్
నిర్మల్ రూరల్: నూతన పీఆర్సీ అమలుకు ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకోవాలని ఎస్టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు జుట్టు గజేందర్ కోరారు. నిర్మల్‌రూరల్ మండలం డ్యాంగాపూర్ గిరిజన ఆశ్రమ పాఠశాలలో మంగళవారం సభ్య త్వ నమోదు చేపట్టారు. ఈ సందర్భంగా గజేందర్ మాట్లాడుతూ పీఆర్సీ గడువు ముగిసి రెండేళ్లు పూర్తయిందన్నారు. ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతుల అంశం వివాదాస్పదంగా మారుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరహాలో ప్రత్యేక యాక్ట్ రూపొందించాలని కోరారు. ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల సమస్యలు పరి ష్కరించాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయ సమస్యలపై ఎప్పటికప్పుడు ఎస్టీయూ రాజీలేని పోరాటాలు చేస్తుందని అన్నారు. పెండింగ్ డీఏలు, ట్రెజరీ బిల్లులు వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు. మేనిఫెస్టో హామీ మేరకు సీపీఎస్ రద్దు చేసి, పాతపెన్షన్ విధానం పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు భూమన్న యాదవ్, లక్ష్మణ్ పాఠశాల ఇన్‌చార్జి ప్రధానోపాధ్యాయులు వసంత్, భూక్యా రమేశ్, తాళ్ల రవి, నాందేవ్ పాల్గొన్నారు.