
పంచాయతీల అభివృద్ధికి కృషి
కుంటాల: పంచాయతీల అభివృద్ధికి సమష్టిగా కృషి చేయాలని అడిషనల్ కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ సూచించారు. మండలంలోని సూర్యాపూర్ గ్రామంలో శుక్రవారం పర్యటించారు. పల్లెలన్నీ పచ్చదనంతో కళకళలాడేందుకు వన మహోత్సవాన్ని విజయవంతం చేయాలని కోరారు. గ్రామాల్లో సేకరించిన చెత్తను తడి,పొడిగా వేరుచేసి వర్మీకంపోస్టు తయారు చేసి ఆదాయం పొందాలని సూచించారు. అనంతరం ఓలా ప్రాథమిక పాఠశాలను పరిశీలించి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని ఆదేశించారు. ఆయన వెంట ఎంపీడీవో అల్లాడి వనజ, ఎంపీవో రహీంఖాన్, ఏపీవో నవీన్, హెచ్‌ఎం శ్రావణ్ కుమార్, పంచాయతీ కార్యదర్శులు రాజు, రాజబాపు, గంగాప్రసాద్ తదితరులు ఉన్నారు.
మంచె ఎక్కి.. మొక్కలను పరిశీలించి..!
కుంటాల: మండలంలోని సూర్యాపూర్ బృహత్ పల్లె ప్రకృతి వనంలో 4 వేల పండ్ల మొక్కలను పెంచి అధికారులు రక్షించారు. శుక్రవారం అడిషనల్ కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ గుట్ట ప్రాంతంపై ఉన్న మొక్కలను అధికారులు ఏర్పాటు చేసిన మంచైపె ఎక్కి పరిశీలించారు. మొక్కలను రక్షించిన అధికారులను ప్రత్యేకంగా అభినందించారు.