
పండుటాకులకు ఆదరణేది?
● శాపంగా మారిన వృద్ధాప్యం ● సాంత్వన దొరకక సతమతం ● వెలుగులోకి పలు ఘటనలు
నిర్మల్‌ఖిల్లా: ఆలనాపాలన లేక వృద్ధ దంపతులు తల్లడిల్లుతున్న ఉదంతాలు జిల్లాలో వెలుగులోకి వస్తున్నాయి. తమ బాగోగులు చూడడం లేదంటూ కొడుకులపై అధికారులకు ఫిర్యాదులు వస్తున్నా యి. తమ స్థిర, చరాస్తులను అనుభవిస్తూ తమను మాత్రం దూరం పెడుతున్నారని పలువురు వృద్ధ త ల్లిదండ్రులు గోడు వెల్లబోసుకుంటున్నారు. వారంక్రితం కుంటాల మండలం లింబా (కే) గ్రామానికి చెందిన బంజ లక్ష్మి అనే వృద్ధురాలు తన పిల్లలు పోషణను విస్మరిస్తున్నారని భైంసా ఆర్డీవో కోమల్‌కు ఫిర్యాదు చేసింది. తహసీల్దార్ కమల్‌సింగ్ ఆ గ్రామాన్ని సందర్శించి వృద్ధురాలి పిల్లలతో మాట్లాడారు. కౌన్సెలింగ్ నిర్వహించి ఆమె బాగోగులు, యోగక్షేమాలు, సంరక్షణ చర్యలు చూసుకోవాలని సూచించారు. మూడు నెలల క్రితం దిలావర్‌పూర్ మండల కేంద్రానికి చెందిన ఓ వ్యక్తి తన అమ్మానాన్నలు సంపాదించిన ఆస్తులు రాయించుకుని వారికి పట్టెడన్నం పెట్టకుండా తీవ్ర మానసికక్షోభకు గురి చేయగా అతడి తల్లిదండ్రులు ఏం చేయాలో తెలియక ఎస్పీని కలిసి గోడు వెల్లబోసుకున్నారు. ఇటీవల సారంగపూర్, దిలావర్‌పూర్ మండలాల్లోనూ ఇలాంటి ఘటనలే వెలుగుచూశాయి.
చట్టాలున్నా చర్యలేవి?
వయోవృద్ధుల సంక్షేమానికి సీనియర్ సిటిజెన్స్ యాక్ట్–2007 సక్రమంగా అమలులో లేదు. వృద్ధు ల సామాజిక, ఆర్థిక భద్రత, ఆస్తుల సంరక్షణ లాంటి వాటిపై తగిన చర్యలు లేవు. ఈ చట్టాలపై దృష్టి పెట్టి అవగాహన కల్పించాలని సీనియర్ సిటిజన్లు కోరుతున్నారు. చట్టాల అమలులో తాత్సారం చే యకుండా సంబంధిత అధికారులు సత్వరమే చర్యలు చేపట్టాలని వేడుకుంటున్నారు. యాక్ట్‌కు అనుగుణంగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు వారి సంక్షేమ నియమావళిని రూపొందించాయి. 2011, 2019లో ఈ యాక్ట్‌కు కేంద్రం మరిన్ని రక్షణ సవరణలు చేసినా, అవి పూర్తిస్థాయిలో అమలులోకి రా వాల్సి ఉంది. వయోవృద్ధులు ఎదుర్కొంటున్న స మస్యల పరిష్కారానికి ‘ఎల్డర్ లైన్ 14567’ పేరిట హెల్ప్ లైన్ అందుబాటులో ఉంది. దీని ద్వారా పో షణ, సంరక్షణ, నిరాశ్రయ వృద్ధులకు తగిన సహకారం, చట్టపరమైన తోడ్పాటు, మానసిక భావోద్వేగాలకు కౌన్సెలింగ్ సౌకర్యం కల్పిస్తారు. ఈ కార్యక్రమాలన్నీ దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో చేపడుతున్నారు.
వృద్ధులపై వివక్ష వద్దు
వృద్ధులపై వివక్ష చూపించడం తగదు. వారిని ని రాదరణకు గురి చేయొ ద్దు. ఎక్కడైనా వివక్ష చూపిస్తే కౌన్సెలింగ్ ఇస్తున్నాం. అవగాహన కల్పి స్తున్నాం. ఇప్పటికే పదుల సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. ఇలాంటి సమస్యలు ఎదుర్కొనే వయోవృద్ధులు హెల్ప్‌లైన్ నంబర్ 14567కు సమాచారం ఇస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.
– ఫైజాన్ అహ్మద్,
జిల్లా సంక్షేమశాఖల అధికారి

పండుటాకులకు ఆదరణేది?