
ఆగుడా.. సాగుడా..?
నిర్మల్
బీడీ కార్మికుల పిల్లలకు ‘ఉపకార’ం
బీడీ కార్మికుల పిల్లలు చదువులో రాణించేలా కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ చేయూతనిస్తోంది. ఒకటో తరగతి నుంచి ప్రొఫెషనల్ కోర్సుల వరకు అండగా నిలుస్తోంది.
10లోu
బుధవారం శ్రీ 16 శ్రీ జూలై శ్రీ 2025
హంగిర్గా సొసైటీకి అవార్డు
తానూరు: తానూరులోని హంగిర్గా సొసైటీకి బెస్ట్ అప్రిషియేషన్ అవార్డు లభించిందని సొసైటీ బ్యాంక్ చైర్మన్ నారయణరావుపటేల్, సీఈవో భుమయ్య తెలిపారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని హంగిర్గా సొసైటీ బ్యాంక్ రైతులకు రుణాలు అందించి, మెరుగైన రికవరీ చేయడంతో ఈ అవార్డు అందినట్లు తెలిపారు. హైదరాబాద్‌లో మంగళవారం నిర్వహించిన నాబార్డ్ 44వ వారికోత్సవంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అవార్డు ప్రదానం చేశారు.
లక్ష్మణచాంద/భైంసా రూరల్: వానాకాలం సీజన్ ప్రారంభమై రెండు నెలలు గడిచినా జిల్లాలో భారీ వర్షాలు లేకపోవడంతో వ్యవసాయం నెమ్మదిగా సా గుతోంది. వరి, సోయాబీన్, మొక్కజొన్న, పసుపు, కంది, పెసర వంటి పంటలను ఇప్పటికే రైతులు విత్తారు. చెరువులు, కుంటల్లోకి నీరు చేరకపోవడంతో వరిసాగు ఆలస్యమవుతోంది. ఈ వానాకాలంలో జూలై 14 నాటికి సాధారణ వర్షపాతం 306.1 మిల్లీమీటర్లు ఉండాల్సి ఉండగా, 224.3 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదైంది. 26.7 మిల్లీమీటర్ల లోటువర్షపాతం ఉందని అధికారులు తెలిపారు. ఈ సీజన్‌లో ఒక్క భారీ వర్షం కూడా కురవకపోవడంతో చెరువులు, కుంటలు, ప్రాజెక్టుల్లోకి వరద రాలేదు. దీంతో కడెం మినహా మిగతా జలాశయాలు, చెరువులు, కుంటలు వెలవెలబోతున్నాయి. దీంతో రైతులు వరి సాగు చేయాలా.. వేచి చూడాలా అనే సందిగ్ధంలో ఉన్నారు.
సాగు అంచనా ఇలా..
జిల్లాలో మొత్తం 4.15 లక్షల ఎకరాల్లో పంటల సా గవుతాయని వ్యవసాయాధికారులు ప్రణాళిక రూ పొందించారు. ఈ సీజన్‌లో వరి 1.35 లక్షల ఎకరా ల్లో, సోయాబీన్ 1.05 లక్షల ఎకరాల్లో, మొక్కజొన్న 20 వేల ఎకరాల్లో, పసుపు 5,542 ఎకరాల్లో, కంది 9,693 ఎకరాల్లో, పెసర 210 ఎకరాల్లో సాగు చేస్తారని అంచనా వేశారు. ఆరుతడి పంటలు అంచనా మేరకు సాగు చేశారు. ప్రస్తుతం కురిసిన వర్షాలు వాటికి అనుకూలంగానే ఉన్నాయి. వరి మాత్రం కేవలం 1,000 ఎకరాల్లోనే నాట్లు వేశారు. ఇప్పటికే నార్లు ఎదిగి ఉన్నాయి. భారీ వర్షాలు కురవడం లేదు. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
వరుణుడి కరుణ కోసం..
జిల్లా రైతులు వర్షాల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. గ్రామ దేవతలకు పూజలు, జలాభిషేకాలు, భజనలు, అన్నదానాలు నిర్వహిస్తున్నారు. ఒక భారీ వర్షం కురిస్తే చెరువులు, ప్రాజెక్టులు నిండి, భూగర్భ జలాలు పెరిగి, బోర్లు, కాలువల ద్వారా సాగుకు నీరు అందుతుందని ఆశిస్తున్నారు.
ఆందోళన వద్దు..
జిల్లాలో ముందస్తు వర్షాలు కురిశాయి. ఇప్పుడు లేవు. భారీ వర్షాలు కురిసిన తర్వాతనే వరి నాట్లు వేసుకోవాలి.త్వ రలో మంచి వర్షాలు వున్నాయని వాతావరణ శాఖ తెలిపుతోంది. రైతులు ఆందోళన చెందొద్దు. ఆగస్టు 20 వరకు నాట్లు వేసుకోవచ్చు.
– అంజిప్రసాద్, జిల్లా వ్యవసాయ అధికారి
‘సరస్వతి’ నీళ్లు వస్తేనే..
మాది లక్ష్మణచాంద మండలం. మా మండలానికి సరస్వతి కాలువనే ప్రధాన ఆధారం. కాలువ నీళ్లు వస్తేనే చెరువులు, కుంటలు నిండుతాయి. పంటలు సాగవుతాయి. ఎస్సారెస్పీలో నీళ్లు లేక కాలువ రావడం లేదు.
– రమణారెడ్డి రైతు
భారీ వర్షం లేదు
ఈయేడు ఇప్పటి వరకు ఒక్క భారీ వర్షం కూడా కురవలేదు. భారీ వర్షాలు కురిస్తే భూగర్భ జలాలు పెరుగుతాయి. ప్రస్తుతం బోరు బావుల్లో నీరు తగ్గింది. వారం రోజులుగా జల్లు వానలు కూడా కురవడం లేదు. భారీ వర్షం కోసం ఎదురుచూస్తున్నాం.
– విశ్వనాథ్, రైతు కోతల్‌గాం
న్యూస్‌రీల్
ఖరీఫ్ ప్రారంభమై రెండు నెలలు
వర్షాలు లేక రైతుల ఇబ్బందులు
జిల్లాలో 26.7 మి.మీల లోటు వర్షపాతం
వెలవెలబోతున్న చెరువులు, కుంటలు
వెయ్యి ఎకరాల్లోనే వరినాట్లు
వెలవెలబోతున్న చెరువులు, కుంటలు..
జిల్లాలోని నిర్మల్, భైంసా, కోతల్‌గాం, తిమ్మాపూర్, కామోల్, లోకేశ్వరం, తానూరు, కుభీరు, కుంటాల, సారంగాపూర్, నర్సాపూర్, ఖానాపూర్ మండలాల్లో ప్రధాన చెరువులు, కుంటలు నీరులేక వెలవెలబోతున్నాయి. దీంతో వరినాట్లు ఎలా వేయాలో తెలియక వరణుడి కరుణ కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. బోర్లు, బావుల్లోనూ నీటిమట్టం తగ్గడంతో నాట్లు వేయడానికి వెనుకాడుతున్నారు. వారం రోజులుగా వరుణుడు ముఖం చాటేయడం, ఎండ తీవ్రత పెరగడంతో సోయాబీన్, పత్తి, మొక్కజొన్న మొలకలు వాడిపోతున్నాయి. భూమిలో తేమ తగ్గడంతో ఈ పరిస్థితి నెలకొంది.

ఆగుడా.. సాగుడా..?

ఆగుడా.. సాగుడా..?

ఆగుడా.. సాగుడా..?

ఆగుడా.. సాగుడా..?

ఆగుడా.. సాగుడా..?