
మొక్కలు నాటి సంరక్షించాలి
ఖానాపూర్: వర్షాకాలంలో అందరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని అడిషనల్ కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ అన్నారు. పట్టణంలోని కుమురంభీం చౌరస్తాలోని మినీ స్టేడియం ప్రాంతంలో వనమహోత్సవంలో భాగంగా మంగళవారం మొక్కలు నాటారు. పట్టణ పరిధిలోని ప్రజలకు మున్సిపల్ ఆధ్వర్యంలో మొక్కలు అందజేసి వాటిని పర్యవేక్షించే బాధ్యతను అధి కారులు, సిబ్బంది తీసుకోవాలన్నారు. అనంతరం పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ పరిశీలించారు. ప్రయాణికులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ఆయన వెంట మున్సిపల్ కమిషనర్ సుందర్‌సింగ్, మాజీ మున్సిపల్ చైర్మన్ చిన్నం సత్యం తదితరులు ఉన్నారు.