
ట్రాఫిక్ సమస్యపై దృష్టి పెట్టండి
● ఎస్పీ జానకీషర్మిల
నిర్మల్‌టౌన్: జిల్లాలోని నిర్మల్, భైంసా, ఖానాపూర్ పట్టణాల్లో ప్రజలు ట్రాఫిక్ సమస్యతో ఇబ్బంది ప డుతున్నారని, దీనిపై పోలీసులు దృష్టిసారించాల ని ఎస్పీ జానకీషర్మిల ఆదేశించారు. జిల్లా పోలీస్ కార్యాలయం నుంచి జూమ్ మీటింగ్ ద్వారా ట్రాఫిక్ సమస్య, అండర్ ఇన్వెస్టిగేషన్ కేసులపై మంగళవా రం సమీక్ష నిర్వహించారు. మిస్సింగ్ కేసులు, బీఎన్‌ఎస్‌ఎస్ సెక్షన్ 194 కింద ఉన్న కేసుల పురోగతిపై ఆరాతీశారు. పట్టణ ప్రాంతాల్లో ట్రాఫిక్ నియంత్రణకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ప్రతీ కేసుపై సమగ్ర విచారణ..
ఠాణాల్లో నమోదైన ప్రతీ కేసుపై సమగ్రంగా, సమర్థవంతంగా విచారణ చేసి కోర్టులో నేరం నిరూపించాలని ఎస్పీ సూచించారు. విచారణలో అలసత్వం వహించే అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. పెండింగ్ కేసులను నిర్ణీత గడువులోగా విచారణ పూర్తి చేయాలని సూచించారు. సమీక్షలో భైంసా ఏఎస్పీ అవినాష్‌కుమార్, నిర్మల్ ఏఎస్పీ రాజేశ్‌మీనా, ఇన్‌స్పెక్టర్లు, అన్ని పోలీస్ స్టేషన్ల అధికారులు పాల్గొన్నారు.