
కేజీబీవీల్లో వసతులు కల్పించాలి
నిర్మల్: జిల్లాలోని కేజీబీవీల్లో మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అభిలా ష అభినవ్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో సంబంధి త అధికారులతో సోమవారం సమీక్ష నిర్వహించారు. కేజీబీవీల్లో నాణ్యమైన విద్యాబోధనతో పాటు మెరుగైన వసతులు కల్పించాలన్నారు. భవనాల పైకప్పు లీకేజీలు, మరమ్మతులు, అ దనపు మరుగుదొడ్లు, ఫ్లోరింగ్, తలుపులు, కిటికీలు తదితర సమస్యలపై నివేదిక ఇవ్వాలని త హసీల్దార్లు, ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. అవసరమైన చోట ఉపాధిహామీ పథకం నిధులతో పనులు చేపట్టాలని సూచించారు. అ నంతరం వైద్యాధికారులతో సమీక్ష నిర్వహించి న కలెక్టర్ పీహెచ్‌సీలకు అనుబంధంగా సబ్‌సెంటర్ల నిర్మాణంపై ప్రణాళిక రూపొందించా లని సూచించారు. నిర్మాణంలో ఉన్న సబ్ సెంటర్ల పురోగతి వివరాలు అధికారులను అడిగి తె లుసుకున్నారు. పూర్తయిన కేంద్రాల ప్రారంభా నికి ఏర్పాట్లు చేయాలని తెలిపారు. ఆయా స మావేశాల్లో అదనపు కలెక్టర్ ఫైజాన్‌అహ్మద్, డీ ఈవో రామారావు, డీఎంహెచ్‌వో రాజేందర్, కే జీబీవీల సమన్వయకర్త సలోమి కరుణ, తహసీ ల్దార్లు, ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు.