
స్పోర్ట్స్ స్కూల్‌లో ప్రవేశానికి ఎంపిక పోటీలు
నిర్మల్‌టౌన్: 2025–26 విద్యాసంవత్సరానికి హ కీంపేట్, కరీంనగర్, ఆదిలాబాద్ క్రీడా పాఠశాలల్లో నాలుగో తరగతితో ప్రవేశం కోసం జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో బుధవారం జిల్లాస్థాయి ఎంపిక పోటీలు నిర్వహించారు. జి ల్లా నుంచి 46మంది బాలబాలికలు హాజరయ్యా రు. వీరికి తొమ్మిది విభాగాల్లో ఎంపిక ప్రక్రియ నిర్వహించారు. ప్రతిభ కనబరిచినవారిని జూలై 1నుంచి హకీంపేట్‌లో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి పోటీలకు పంపించనున్నట్లు జిల్లా క్రీడల అధికారి శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో ఎంపిక పోటీల స్టేట్ అబ్జర్వర్ శ్రీకాంత్, పెటా సెక్రటరీ భోజన్న, ఎస్జీఎఫ్ సెక్రటరీ రవీందర్‌గౌడ్, పీడీ, పీఈటీలు పాల్గొన్నారు.