
విద్యార్థుల సంఖ్య పెంచాలి
కుభీర్: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచాలని డీఈవో రామారావు అన్నారు. సోమవారం మండలంలోని పల్సి ఉన్నత పాఠశాలలో గ్రామస్తులు, ఉపాధ్యాయులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. జూన్ 6 నుంచి బడిబాట కార్యక్రమం ప్రారంభం కానున్నట్లు తెలిపారు. ఆంగ్ల మాధ్యమం కావాలనుకునేవారు పాఠశాలల కమిటీ తీర్మాణాలను పంపిస్తే మంజూరు చేస్తామన్నారు. పదో తరగతి ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన తైమిన్‌బేగం ఇంటికి వెళ్లి అభినందించారు. సమావేశంలో ఎంఈవో విజయ్‌కుమార్, ప్రధానోపాధ్యాయులు సురేష్, గ్రామపెద్దలు హన్మాండ్లు, రమేశ్, ధర్మపురి, తదితరులు పాల్గొన్నారు.