
జాతీయస్థాయి పోటీలకు ఎంపిక
నిర్మల్‌టౌన్: ఈ నెల 24 నుంచి 26 వరకు మంచిర్యాల ఎఫ్‌ఏసీ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన రాష్ట్రస్థాయి జూనియర్, సబ్ జూనియర్ బాక్సింగ్ పోటీల్లో జిల్లాకు చెందిన ఏడుగురు పాల్గొని జాతీయస్థాయికి ఎంపికయ్యారు. ఇందులో పి.అభినయ (54–57), ఏ.కీర్తన (46–48), శ్రావణి (64–67) కేటగిరీలలో బంగారు పతకాలు సాధించగా నక్షత్ర కాంస్య పతకం సాధించింది. ఇందులో అభినయ, కీర్తన జూన్ 4 నుంచి 7 వరకు గోవాలో జరగనున్న జాతీయ స్థాయి జూనియర్ అండర్–17 బాలికల బాక్సింగ్ పోటీల్లో పాల్గొననున్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ ఛాంబర్‌లో కలెక్టర్ అభిలాష అభినవ్ జాతీయ స్థాయికి ఎంపికై న అభినయ, కీర్తనలను అభినందించారు. జాతీయస్థాయిలో మంచి ప్రతిభ కనబరిచి జిల్లాకు పేరు తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కిషోర్, జిల్లా యువజన క్రీడల అధికారి శ్రీకాంత్‌రెడ్డి, బాక్సింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీధర్, తదితరులు పాల్గొన్నారు.

జాతీయస్థాయి పోటీలకు ఎంపిక