
విస్తరణపై ఆశలు
మహోర్ వరకు విస్తరిస్తే..
భైంసా: జిల్లాలో నూతనంగా నిర్మిస్తున్న ఎన్‌హెచ్–161బీబీ, జిల్లాలో పొడవైన ఎన్‌హెచ్–61 రహదారుల విస్తరణపై ఆశలు చిగురిస్తున్నాయి. వీటి విస్తరణతోపాటు భైంసా–బాసర రహదారిని ఫోర్‌లేన్‌గా అభివృద్ధి చేస్తూ సుందరీకరించాలని ముధో ల్ ఎమ్మెల్యే రామారావుపటేల్ ఇటీవల కాగజ్‌నగర్‌కు వచ్చిన కేంద్రమంత్రి నితిన్‌గడ్కరీని కోరారు. జాతీయ రహదారిపై తరచూ రోడ్డు ప్రమాదాలు జరిగి ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని తెలిపారు. ఏడాదిలోనే రోడ్డు ప్రమాదాల్లో 28మంది మృతిచెందగా, మరో 67మంది తీవ్రంగా గాయపడ్డారని వివరించారు. జిల్లాలో రెండు ప్రధాన రహదారులను విస్తరిస్తేనే ప్రమాదాలు నివారించవచ్చని, ఇందుకు నిధులు మంజూరు చేయాలని కోరారు. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని గతంలోనూ ఢిల్లీలో కలిసి వినతిపత్రం ఇచ్చారు. ఆదిలాబాద్ ఎంపీ నగేశ్‌తోనూ చర్చించారు. అసెంబ్లీలోనూ ప్రస్తావించారు. ఇందుకు కేంద్రమంత్రి సుముఖత వ్యక్తంచేయడంతో జాతీయ రహదారుల విస్తరణపై ఆశలు చిగురిస్తున్నాయి.
ఫోర్‌లేన్.. సెంట్రల్ లైటింగ్
హైదరాబాద్‌నుంచి వయా బోధన్–బాసర మీదుగా భైంసా వరకు 161బీబీ జాతీయ రహదారి పనులు కొనసాగుతుండగా పలు మార్పులు చేయాలనే డిమాండ్ ఉంది. బాసర నుంచి ట్రిపుల్‌ఐటీ వరకు, భైంసా నుంచి దేగాం గ్రామం వరకు రోడ్డును మరింత వెడల్పు చేయాలని, ఫోర్‌లేన్‌గా మార్చు తూ డివైడర్, సెంట్రల్ లైటింగ్ లాంటి సుందరీకరణ పనులు చేపట్టాలని ఆయా ప్రాంతాల ప్రజలు కోరుతున్నారు. అలాగే, బాసర నుంచి భైంసా మీదుగా మహోర్ వరకు ఈ జాతీయ రహదారిని అనుసంధానం చేసి ఆధ్యాత్మిక మార్గంగా అభివృద్ధి చేయాలని అడుగుతున్నారు. ఇక ఎన్‌హెచ్–61పై తానూరు మండలం బెల్‌తరోడ నుంచి నిర్మల్ వరకు ప్రతీ గ్రామం వద్ద రెండు వైపులా మీటర్ మేరకు విస్తరించాలని, డివైడర్‌ను నిర్మించి సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
ప్రమాదాలకు అడ్డుకట్ట ఇలా..
జిల్లాలో భైంసా–బాసర ప్రధాన రహదారిపై తర చూ ప్రమాదాలు జరుగుతున్నాయి. 30 కిలోమీటర్ల దూరంలో విస్తరించి ఉన్న ఈ రహదారి నిర్మాణ పనులు రెండేళ్లుగా కొనసాగుతుండగా 80శాతం పనులే పూర్తయ్యాయి. నిత్యం ఏదో ఒకచోట ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. భైంసా–నిర్మల్ జాతీయ రహదారి 41కిలోమీటర్లు మేర ఉంది. జిల్లాలో ప్రముఖ క్షేత్రమైన బాసరకు.. మరో క్షేత్రమైన అడెల్లికి వెళ్లేందుకు ఈ మార్గంలోనే వేలాది మంది వాహనాల్లో రాకపోకలు సాగిస్తారు. జిల్లాకేంద్రానికీ ఇదే ప్రధానమార్గం. ఇలాంటి ఈరోడ్డు రెండు వరుసలకే పరిమితం కావడం, పలుచోట్ల ఇరుకుగా ఉండటంతో తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ రెండు ప్రధాన రోడ్లు విస్తరిస్తేనే ప్రమాదాలకు అడ్డుకట్ట పడే అవకాశముంటుంది.
విస్తరిస్తేనే ప్రమాదాలకు అడ్డుకట్ట
ప్రధాన రహదారులు విస్తరిస్తేనే ప్రమాదాలకు అడ్డుకట్ట వేయవచ్చు. భైంసా మీదుగా రెండు హైవేలున్నా యి. పలు గ్రామాల్లో ఇరుకుగా ఉన్న ఈ రోడ్లపై తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ రోడ్లను విస్తరించాలని కేంద్రమంత్రి నితిన్‌గడ్కరీని రెండుసార్లు కలిశాను. వినతిపత్రాలు అందజేశాను. ఈమేరకు ఆయన సానుకూలంగా స్పందించారు.
– రామారావుపటేల్, ముధోల్ ఎమ్మెల్యే
వానల్‌పాడ్ వద్ద బాసర–భైంసా రహదారి
చదువులమ్మ కొలువైన బాసర నుంచి భైంసా మీదుగా మహారాష్ట్రలో రేణుకామాత కొలువుదీరిన మహోర్ వరకు హైవేను విస్తరించాలని ఈ ప్రాంతవాసులు చాలాకాలంగా కోరుతున్నారు. ఈ మార్గాన్ని పొడిగిస్తే తెలంగాణతో పాటు మహారాష్ట్రకు చెందిన వేలాదిమంది యాత్రికుల కు ఎంతో సౌకర్యంగా ఉంటుంది. ఆధ్యాత్మిక కారిడార్‌గా ఈ మార్గాన్ని అభివృద్ధి చేయాలని ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ ఇదివరకే కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్‌రెడ్డి దృష్టిని కోరారు. అత్యధికంగా జిల్లావాసులు మహోర్ యాత్రకు ఈ రోడ్డు గుండా వాహనాల్లో వెళ్తూ తరచూ ప్రమాదాల బారిన పడుతున్నారని, ఎలాగైనా కేంద్రం నుంచి నిధులు మంజూరు చేయించి రహదారిని విస్తరించాలని వినతిపత్రం అందించారు.