కొనుగోళ్లు సజావుగా సాగాలి | - | Sakshi
Sakshi News home page

కొనుగోళ్లు సజావుగా సాగాలి

May 12 2025 12:12 AM | Updated on May 12 2025 12:12 AM

కొనుగోళ్లు సజావుగా సాగాలి

కొనుగోళ్లు సజావుగా సాగాలి

నిర్మల్‌చైన్‌గేట్‌: జిల్లాలో వరి ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ సజావుగా కొనసాగేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ అభిలాష అభినవ్‌ ఆదేశించారు. ఆదివారం తన క్యాంపు కార్యాలయంలో సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇప్పటివరకు జిల్లాలో జరిగిన కొనుగోళ్ల వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. కొనుగోలు ప్రక్రియను మరింత వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు రానివ్వొద్దని పేర్కొన్నారు. అకాల వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో టార్పాలిన్లు సిద్ధంగా ఉంచాలని, తూకం వేసిన ధాన్యాన్ని వెంటవెంటనే మిల్లులకు తరలించాలన్నారు. నిర్లక్ష్యం చేసినవారిపై కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు. సమస్యలుంటే రైతులు 91829 58858 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ (రెవెన్యూ) కిశోర్‌కుమార్‌, సివిల్‌ సప్లయ్‌ డీఎం సుధాకర్‌, డీఆర్డీవో విజయలక్ష్మి, డీసీవో రాజమల్లు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement