
ఒక్క కొడుకూ ఆర్మీలోనే..
నిర్మల్ జిల్లా కేంద్రానికి చెందిన రాంలలిత భర్త మల్లేశ్ అనారోగ్యంతో మృతిచెందారు. ఈ దంపతులకు ఇద్దరు బిడ్డలు, ఒక కుమారుడు. రెక్కలకష్టంతో ఇద్దరు బిడ్డల పెళ్లిళ్లు చేశారు. ఒక్కగానొక్క కుమారుడినీ దేశసేవ కోసం పంపించారు. లలిత, మల్లేశ్ దంపతుల కుమారుడు కార్తీక్ ప్రసుతం ఇండియన్ ఆర్మీలో పనిచేస్తున్నాడు. కొడుకు తనవద్ద లేకున్నా.. కోట్లాదిమంది రక్షణలో భాగస్వామిగా ఉన్నాడని లలిత గర్వంగా చెబుతోంది. తల్లిగా కాస్త బాధ ఉన్నా.. ఎంతోమంది తల్లుల కోసం తాను పనిచేస్తున్నాడన్నది సంతోషాన్నిస్తోందంటున్నారు.