
ఫిర్యాదులపై త్వరగా స్పందించాలి
భైంసాటౌన్: ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై వెంటనే స్పందించాలని ఎస్పీ డాక్టర్ జీ జానకీ షర్మి ల ఆదేశించారు. బుధవారం పట్టణంలోని తన క్యాంప్ కార్యాలయంలో ప్రజావాణి నిర్వహించా రు. ఈ సందర్భంగా అర్జీదారుల నుంచి ఫిర్యాదులు స్వీకరించి సంబంధిత స్టేషన్ ఆఫీసర్లతో ఫోన్‌లో మాట్లాడి పరిష్కరించాలని సూచించారు. కుటుంబ కలహాల కేసులకు సంబంధించి పలు జంటలకు షీ టీం సిబ్బందితో కౌన్సెలింగ్ ఇప్పించారు. అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి చేతులమీదుగా అవార్డు అందుకున్న పట్టణ సీఐ జీ గోపీనాథ్‌ను అభినందించారు. కార్యక్రమంలో ఏఎస్పీ అవినాష్‌కుమార్, సీఐ మల్లేశ్, ఎస్సైలు శంకర్, గణేశ్, షీ టీం ఇన్‌చార్జి మహిళా ఎస్సై పెర్సిస్, సిబ్బంది, క్యాంప్ ఇన్‌చార్జి రఘువీర్ తదితరులు పాల్గొన్నారు.